ఈమె స్టార్ హీరోయిన్. వయసుతో పాటే గ్లామర్ ని పెంచేసుకుంటున్న ఈ బ్యూటీ.. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ యాక్ట్ చేసింది. ఎవరో గుర్తుపట్టారా?
కొందరు హీరోయిన్లు యాక్టింగ్ బాగా చేస్తారు. మరికొందరు డ్యాన్స్ బాగా చేస్తారు. ఈ రెండు టాలెంట్స్ కలిసున్న బ్యూటీస్ చాలా తక్కువమంది ఉంటారు. ఈమె అలాంటి భామ. సౌత్ లో ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించేసింది. చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చేస్తూనే ఉంది. దాదాపు 18 ఏళ్లుగా తెలుగులో సినిమాలు చేస్తోంది. ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు గానీ ఓ హీరోతో రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. నార్మల్ గా ఎలా ఉన్నాసరే హీరోయిన్లు, స్క్రీన్ పై గ్లామర్ గా కనిపించేందుకు కాస్త మేకప్ లాంటివి వేస్తారు. కానీ ఈమెకు అవేం అక్కర్లేదు. ఎందుకంటే మిల్క్ అంతా తెల్లగా ఉంటుంది. అందుకే ఈమెని ముద్దుగా మిల్కీ బ్యూటీ అంటుంటారు. యస్ మీరు గెస్ చేసింది కరెక్ట్. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు తమన్నా. ‘శ్రీ’ మూవీతో హీరోయిన్ గా మారిన ఈమె.. ‘హ్యాపీడేస్’తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ సుకుమార్ ఈమె కెరీర్ ని టర్న్ చేశారనే చెప్పాలి.
‘100% లవ్’ హీరోయిన్ గా చేసిన తమన్నా.. హిట్ కొట్టేసింది. ఆ వెంటనే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలతో నటించే ఛాన్సులు కొట్టేసింది. ఈ ఇద్దరు హీరోల డ్యాన్స్ స్పీడ్ కి తట్టుకోవడం హీరోయిన్లకు కాస్త కష్టమైన విషయం. అలాంటిది చెర్రీ, బన్నీతో పోటాపోటీగా స్టెప్పులేసి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో తనదైన యాక్టింగ్, డ్యాన్స్ తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో రిలేషన్ లో ఈమె ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అది పక్కనబెడితే ప్రస్తుతం చిరు, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.