ముద్దుగుమ్మ తమన్నాకు ఎన్నాళ్ల నుంచో ఉన్న ఆ కోరిక తీరిపోయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ తమన్నా అనగానే మిల్కీ బ్యూటీ అని గుర్తొస్తుంది. పాల మీగడలా మంచి స్కిన్ టోన్ తో ఉండే ఈ భామ.. ఇప్పటికీ డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ మూవీస్ చేస్తూనే ఉంది. కేవలం తెలుగు వరకే పరిమితం అయిపోకుండా తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. కొన్నాళ్ల ముందు న్యూయర్ సందర్భంగా హిందీ నటుడు విజయ్ వర్మని కిస్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అలా ఓ వైపు సినిమాలు, మరోవైపు నటుడితో రిలేషన్ షిప్ అని న్యూస్ లో వస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి చర్చనీయాంశంగా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘హ్యాపీడేస్’ మూవీతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికీ దాన్ని నిలుపుకొన్నవారిలో ఇద్దరే ఉన్నారు. హీరో నిఖిల్ ఒకడైతే, హీరోయిన్ తమన్నా మరొకరు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన తమన్నా.. బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’, సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘జైలర్’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను చేస్తున్న సినిమాల గురించి మాట్లాడింది.
‘రజనీకాంత్ గారితో పనిచేస్తానని ఊహించలేదు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాలాంటి ఎంతోమంది నటీమణులు కోరుకుంటారు. ‘జైలర్’ సినిమాతో నా కోరిక తీరుతోంది. నా కల నిజం కాబోతుంది. ఆయన్ని సెట్ లో చూసే రోజు కోసం ఎదురుచూశాను. అలానే చిరంజీవి గారితో కలిసి ‘సైరా’ చేశాను. ఇప్పుడు ‘భోళా శంకర్’తో మరోసారి అవకాశం వచ్చింది. ఆయనతో డ్యాన్స్ చేయడం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా తమన్నా.. హిందీలో చేస్తున్న ఓ సినిమా లేటవుతూ వస్తోంది. మలయాళంలో చేస్తున్న తొలి మూవీ చిత్రీకరణలో ఉంది. వీటితో పాటు పలు వెబ్ సిరీసులు కూడా ఈ భామ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. తమన్నా వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.