కొంతమంది సెలబ్రిటీల దృష్టిలో దాంపత్య జీవితం అనేది ఒక ఐటం సాంగ్ లాంటిది. సినిమాలో స్పెషల్ సాంగ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు.. వారి వ్యక్తిగత జీవితాల నుంచి దాంపత్యం కూడా కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతుంది. భార్యాభర్తలు అంటే సర్దుకుపోవాలి అని పెద్దలు చెబుతారు. దానికి ఇప్పటి ఉడుకు రక్తం.. నిజంగానే సర్దుకుపోతున్నారు. బట్టలు బ్యాగ్ లో సర్దుకుని పోతున్నారు. భాగస్వామితో మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. ఎందుకు సర్దుకుపోవాలి? ఎందుకు రాజీ పడాలి? అని అటు భర్త, ఇటు భార్య ఇద్దరూ అహం, అసూయలతో రగిలిపోతూ.. చివరికి విడిపోతున్నారు. అలా పెళ్ళైన 6 నెలలకే విడిపోయిన వారిలో సింగర్ నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా జంట ఒకటి.
వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. కానీ ఎందుకో సెట్ అవ్వలేదు. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దీంతో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. సింగర్ నోయెల్ తన సింగింగ్ వృత్తిలో బిజీగా ఉంటే, ఎస్తేర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా 69 సంస్కార్ కాలనీ అనే రొమాంటిక్ మూవీలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సమయంలో ఆమె నోయెల్ పై పలు ఆరోపణలు చేసింది. తనతో విడిపోయిన తర్వాత నోయెల్.. తనపై నిందలు వేసి నెగిటివ్ ప్రచారం చేశాడంటూ ఆరోపించింది. విడాకుల తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లిన నోయెల్.. విడాకుల ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడని కామెంట్స్ చేసింది. తనను అన్ని రకాలుగా వాడుకుని తనను బ్యాడ్ చేశాడంటూ నోయెల్ పై మండిపడింది.
తనను బ్యాడ్ చేయడంతో.. తనపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం లాంటి నోయెల్ ని వదిలేసి ఎలా వెళ్లిపోయావ్ అనేలా తన మీద సింపతీ సెట్ చేసుకున్నాడని నోయెల్ పై విమర్శలు చేసింది ఎస్తేర్. దీంతో వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే మూడేళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని ఆమె వెల్లడించింది. పెళ్ళైన ఆరు నెలలకే ఇద్దరం విడాకులు తీసుకున్నామని, కానీ తాము కలిసి ఉన్నది కేవలం 16 రోజులు మాత్రమే అని ఆమె వెల్లడించింది. అయితే విడిపోవడంలో ఇద్దరి తప్పు ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరి మీద నింద వేయడం కరెక్ట్ కాదని, తన తప్పు కూడా ఉంది కాబట్టి సైలెంట్ గా ఉన్నానని అన్నారు. అయితే తన సైలెన్స్ ని చేతకానితనంగా తీసుకుని.. తన కెరీర్ కోసం నోయెల్ తనను వాడుకున్నాడని ఆరోపణలు చేసింది.