విశ్వక్ సేన్ ఒక మాస్ హీరోగా తనని తాను ఎత్తుకున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల్లో తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. పాగల్ సినిమాతో కాస్త తడబడినా కూడా.. అశోకవనంలో అర్జున కల్యాణం అని డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ కు సినిమాలు కాకుండా.. కుక్కలు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత కార్లు, బైక్లు అంటే ఇంట్రస్ట్. ఆ ఇంట్రస్ట్ తోనే విశ్వక్ ఒక సూపర్ బైక్ కొనేశాడు. దాని ధరతో ఒక మంచి కారు కొనేయచ్చు.
ఇదీ చదవండి: షోలో గెటప్ శ్రీనుకి అవమానం! ఏమైందంటే?
బైక్ అంటే చిన్నా చితకది కాదు. డుకాటి కంపెనీకి చెందిన లేటెస్ట్ డుకాటి స్కాబ్లంర్ 2022 మోడల్ బైక్ అది. దాని ధర దాదాపు రూ.10 లక్షలు. అవును ఆ డబ్బుతో ఒక మంచి కారు కొనేయచ్చు. కానీ, ఒక వస్తువు మీద ఇష్టం ఉంటే దాని ధర కన్నా కూడా దాన్ని కొనేయాలి అనే కోరికే ఎక్కువ ఉంటుంది. అలాగే విశ్వక్ కూడా పది లక్షలు పెట్టి డుకాటి బైక్ కొనేశాడు. ఈ బైక్ 803 సీసీతో వస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 198 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అయితే ఆ వేగాన్ని పరీక్షించకుండా ఉంటేనే మంచిది. విశ్వక్ సేన్ కొత్త బైక్ ఎలా ఉందో చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.