గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కుమారుడి పేరిట ఓ పొలిటికల్ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది..
ఇళయ దళపతి విజయ్‌కి తమిళనాట ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తమిళనాట సూపర స్టార్ రజినీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ బేస్ ఉన్న నటుడిగా విజయ్ పేరు వినిపిస్తోంది. ఆయన తాజాగా చిత్రం ‘వారిసు’ తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. అయితే, ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్‌లో విజయ్ తన తల్లిదండ్రుల్ని అవమానించారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఈవెంట్‌లో విజయ్ తన తల్లిదండ్రుల్ని సరిగా పట్టించుకోలేదని, ఇవ్వవల్సినంత మర్యాద ఇవ్వలేదన్న పుకార్లు ఊపందుకున్నాయి. అసలు విషయానికి వస్తే.. జనవరి 2న వారిసు ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్, తల్లి శోభన కూడా వచ్చారు. విజయ్ ఆడియో ఈవెంట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు కూడా వచ్చారు. వారిని కూడా పలకరించి అక్కడినుంచి ముందుకు వెళ్లారు. అయితే, సొంత తల్లిదండ్రుల్ని సరిగా పట్టించుకోలేదని, ఏదో మొక్కుబడిగా వారిని పలకరించారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ వార్తలపై ఆయన తల్లి శోభన స్పందించారు. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘‘ ఆ వేడుక కేవలం ‘వారిసు’ సినిమా కోసం.. ‘విజయ్’ కోసం జరిగింది. ఓ పెద్ద ఈవెంట్‌లో నా కుమారుడినుంచి అంతకన్నా మేం ఏం ఆశిస్తాం చెప్పండి’’ అని అన్నారు.
కాగా, తండ్రి చంద్రశేఖర్‌కు విజయ్‌కి మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొన్నేళ్లనుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్ పేరిట ఓ రాజకీయ పార్టీ పెట్టారు. అయితే, ఈ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇక, అప్పటినుంచే విజయ్‌కి కుటుంబంతో సంబంధాలు బీటలు బారాయన్న వార్తలు వస్తున్నాయి. మరి, వారిసు ఈవెంట్ విజయ్ తన తల్లిదండ్రుల్ని అవమానించారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.