సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుల మరణవార్తలను మరువకముందే శుక్రవారం మరో ఇద్దరు సెలబ్రిటీలు కన్నుమూయడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ లో అనారోగ్య కారణంగా సీనియర్ నటి జమున మృతి చెందారు. చెన్నైలో బిల్డింగ్ పైనుంచి పడి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి చనిపోయారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాసమూర్తికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ స్టార్స్ అయినటువంటి సూర్య, అజిత్, విక్రమ్ లతో పాటు అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ నటులకు ఈయన డబ్బింగ్ చెప్పి.. వారి పాత్రలకు తెలుగులో జీవం పోశారు.
ఇక తమిళ స్టార్ హీరో సూర్యకి చెప్పిన సింగం సిరీస్, అపరిచితుడులో విక్రమ్ కి డబ్బింగ్ చెప్పి మూర్తి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. కెరీర్ లో విలన్స్, హీరోస్, క్యారెక్టర్ ఆర్టిస్టులు.. కమర్షియల్ యాడ్స్, హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు సైతం మూర్తి గాత్రం అందించారు. ఈయన వాయిస్ కి బేస్ ఎక్కువ. పవర్ ఫుల్ డైలాగ్స్ ని అద్భుతంగా పలికించగలరు. సూర్యకి తెలుగులో ఫ్యాన్ బేస్ ఎంత ఉందో.. ఆయన ప్రతీ సినిమాకి మూర్తి డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. సూర్య – మూర్తి కాంబినేషన్ లో సింగం, సింగం 2, సింగం 3 సినిమాలు ఎంత బిగ్ హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడాయన లేకపోవడం అనేది ఇండస్ట్రీకి, హీరోలకి తీరని లోటు.
ఈ నేపథ్యంలో అటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పాటు ప్రేక్షకులు, అభిమానులు శ్రీనివాసమూర్తి మృతిపట్ల బాధను, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ రాబోవు సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలలో ఈయన వాయిస్ లేకుండా ఊహించుకోవడం కష్టం అని అంటున్నారు. ఇదిలా ఉండగా.. సూర్యతో మూర్తికి మంచి అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ కాంబినేషన్ లో వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా సూర్యకి తెలుగులో ఇంత క్రేజ్ రావడానికి సింగం సినిమాలో మూర్తి చెప్పిన డబ్బింగ్ కూడా ప్రధాన కారణం. దీంతో మూర్తి మృతిపట్ల సూర్య స్పందిస్తూ ట్వీట్ చేశారు. “శ్రీనివాసమూర్తి గారి మరణం పర్సనల్ లాస్ అని, ఆయన వాయిస్, ఎమోషన్స్ నేను చేసిన పాత్రలకు తెలుగులో ప్రాణం పోశాయి. మిస్ యూ సర్” అని చేసిన ఎమోషనల్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సూర్య – మూర్తిల కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
This is a huge personal loss! Srinivasamurthy Garu’s voice & emotions gave life to my performances in Telugu. Will miss you Dear Sir! Gone too soon.
— Suriya Sivakumar (@Suriya_offl) January 27, 2023
Powerful Voice for powerful roles 💥 One of the greatest Dubbing artists Srinivasa Moorthy garu is no more💔 #RIPSrinivasaMoorthyGaru🙏
Can’t imagine anyone else’s voice for @Suriya_offl in Telugu !!#SrinivasaMoorthy pic.twitter.com/OWbL7pcQ4Z
— Ravi Theja (@IamRavitheja) January 27, 2023
Rest in Peace Dubbing artist #SrinivasaMoorthy Garu 🙏
Rest In Peace Sir pic.twitter.com/gxlIgZEbKo— SNEHA TIWARI (@iam_tiwari) January 27, 2023