హీరో సిద్ధార్థ్‌కు తెలుగులో మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంది. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే టాలీవుడ్‌లో సక్సెస్ కావాలంటే మాస్ పల్స్ పట్టుకోవాలి, మాస్ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ కాగలమని.. ఫ్యామిలీ హీరోలకు ఆదరణ తక్కువనే విషయాన్ని గ్రహించాడు. తర్వాత టాలీవుడ్‌కు కాస్త దూరంగానే ఉంటూ వచ్చాడు. ఇటీవలే శర్వాదనంద్‌తో కలిసి మహా సముద్రం అనే మల్టీస్టారర్ లో నటించాడు. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే అప్పటి నుంచి సిద్ధార్థ్ గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతూ వస్తోంది. తాజాగా సిద్ధార్థ చేసిన సోషల్ మీడియా పోస్టుతో ఆ పుకార్లపై మరింత క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
విషయం ఏంటంటే.. హైదరాబాద్ హీరోయిన్ అదితి రావు హైదరీ, హీరో సిద్ధార్థ లవ్‌లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని, లివ్ ఇన్ లో ఉన్నారంటూ పలు సందర్భాల్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఓసారి సెలూన్‌లో నుంచి ఇద్దరూ కలిసి వస్తూ కెమెరాలకు కూడా చిక్కారు. అప్పుడు ఈ వార్తలు మరింత జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అప్పటి నుంచి వీళ్లదరికి సంబంధించి పెద్దఎత్తున ప్రచారాలు జరిగాయి. వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే ఒకటి కాబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వీరి రిలేషన్ గురించి మళ్లీ వార్తలు రాలేదు. కానీ, తాజాగా మరోసారి వీరి రిలేషన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సిద్ధార్థ్ చేసిన పోస్టుతోనే రిలేషన్ వ్యవహారం మరోసారి వైరల్ అవుతోంది.
ఈరోజు (అక్టోబర్ 28) అదితి రావు హైదరీ తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో ప్రముఖులు, సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హీరో సిద్ధార్థ్ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అయితే అతను షేర్ చేసిన పోస్టు, పెట్టిన కొటేషన్ ఇప్పుడు నెట్టింట పలు చర్చలకు, అనుమానాలకు తావిచ్చింది. కొందరైతే వాళ్ల మెధ్య రిలేషన్ అనే వార్తలకు క్లారిటీ ఇచ్చేశాడు అని కూడా చెబుతున్నారు. మరోవైపు సిద్ధార్థ్‌తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు అదితి రావు హైదరీ చెన్నై వెళ్లిందని కూడ చెబుతున్నారు. వాళ్లిద్దరూ కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే నిజం అయితే మరి సిద్ధార్థ ఆ విషయాన్ని, పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తాడా? లేక గోప్యంగానే ఉంచుతాడా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన పోస్టు మాత్రం వైరల్‌గా మారింది.