గత కొంత కాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ముంబయి నగరంలో సల్మాన్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన పక్కింటి వ్యక్తి కేతన్ కక్కడ్‌పై కేసు వేశాడు. అతడి వీడియోలు తన మనోభావాలను దెబ్బతీశాయని సల్మాన్ పేర్కొంటు బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే..
సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఓ ఫామ్ హౌజ్ పన్వేల్లో ఉంది. గత కొంత కాలంగా ఆయన ఫామ్ హౌజ్ పక్కన ఉంటున్న కేతన్ కక్కడ్ తనపై అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేసి తన గౌరవానికి భంగం కలిగిస్తున్నాడని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వెంటనే ఆ వీడియోలు సోషల్ మీడియా నుంచి తొలగించాలని.. ఆయన పిటీషన్ లో కొరారు. అంతేకాదు కక్కడ్ తన మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయకుండా కోర్టు ఆదేశించాలని కోర్టుని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సల్మాన్ ఖాన్‌ను మొఘల్ రాజులు బాబర్, ఔరంగజేబులను పోలుస్తున్నాడని, అంతేకాదు అక్కడ గణేష్ ఆలయం మూయించేందుకు సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తన వీడియోల్లో పేర్కొన్నాడని సల్మాన్ ఖాన్ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సల్మాన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇక పూర్తి వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.