నటీ నటులు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో ఛేదు అనుభవాలను చవిచూస్తుంటారు. నిర్మాతల వల్లనో, డైరెక్టర్ల వల్లనో, హీరోల వల్లనో అవమానాలు ఎదుర్కొని బాధపడిన హీరోయిన్స్ ఉన్నారు. ఇదే విధంగా బాలీవుడ్ నటి హేమశర్మ తనకు జరిగిన అవమానం గురించి వెళ్లడించింది.
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు, అవమానాలు, గాసిప్స్, రూమర్స్ కామన్ గానే వినిపిస్తుంటాయి. హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్, హీరోయిన్లు వేధింపులకు గురైన సంఘటనలు సినిమా రంగంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వేధింపులకు సంబంధించిన విషయాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వంటి అన్ని ఇండస్ట్రీలలో వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కు చెందిన ఓ నటి తను ఎదుర్కొన్న తీవ్రమైన అవమానం గురించి ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది.
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన హేమశర్మ తన నటనతో గుర్తింపు పొందింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్య్వూలో తను అవమానానికి గురైనట్లు వెల్లడించింది. దాదాపు 100 మంది ముందు అవమానించారని తన మనసులోని ఆవేదనను బయటపెట్టింది. సల్మాన్ ఖాన్ ను కలిసేందుకు వెళ్లిన తనకు ఘోరమైన అవమానం జరిగిందని తెలిపింది. దబాంగ్ 3లో నటించిన హేమ శర్మ ఆ సినిమా షూటింగ్ సెట్ లో సల్మాన్ తో ఫొటో దిగేందుకు వెళ్లినప్పుడు ఆయన బాడీగార్డ్స్ కుక్కలా తరిమేశారని, సెట్లో సుమారు 100 మంది చూస్తుండగా అవమానించారని హేమశర్మ తెలిపింది. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ తనతో దురుసుగా ప్రవర్తించారని ఆ ఘటనతో పది రోజుల వరకు నిద్రపట్టలేదని తెలిపింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను నటించిన సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటారు. సల్మాన్ ఖాన్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు కొందరు సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తుండడంతో సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల సల్మాన్ ఖాన్ హాజరైన ఓ వేడుకలో ఆయనను కలిసేందుకు వెళ్లిన విక్కి కౌశల్ ను బాడీగార్డ్స్ తోసేసిన విషయం తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 మూవీ కోసం మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.