తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం మూవీ సెలక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామికి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. వివరాల్లోకి వెళితే..
రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్ ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన జూలై 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన చిత్రం బృందం నిన్న ఈ సినిమాలోని ‘విజిల్.. విజిల్..’ పాటను స్టార్ హీరో సూర్య చేత రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ.. ఈ పాట కోసం చాలా కష్టపడ్డామని.. చాలా అద్భుతంగా వచ్చిందని అన్నారు.
ఇంత మంచి సాంగ్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర బృందం గురించి మాట్లాడిన రామ్ దర్శకుడు లింగు స్వామి గురించి చెప్పడం మర్చిపోయారు. తన పొరపాటు గ్రహించిన రామ్ ట్విట్టర్ వేదికగా ఆయన మనసారా క్షమాపణలు అంటూ కోరారు. అయితే రామ్ పెట్టిన ట్విట్ కి దర్శకులు లింగు స్వామి కూడా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Totally missed mentioning the MAIN MAN at the end amidst all the madness!!
My Warriorrrr! My Director @dirlingusamy sir! Sir you have carried every single frame of this film on your shoulders!Thank you for being one of the best directors I’ve worked so far!!Sorry & Love you!!♥️
— RAm POthineni (@ramsayz) June 22, 2022
Sir I know how much you loved working me, the hug you gave me after watching the film is & will always be in my heart.
Those claps & whistles are what we look forward to & I knew there is long travel between us moving forward. https://t.co/u1JXW5HHxI— Lingusamy (@dirlingusamy) June 22, 2022