తెలుగు సినిమా హీరోలు యాక్టింగ్, డాన్స్‌తో పాటు లుక్‌పై కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. దాని కోసం జిమ్‌లలో గంటలకు గంటలు చెమట చిందిస్తూ సిక్స్‌ప్యాక్ బాడీని బిల్డప్ చేస్తున్నారు. ఒక్క దెబ్బకు పదిమంది విలన్లు గాల్లోకి లేవాలంటే దానికి తగ్గట్టు హీరో కూడా కనిపించాలని అప్పుడు ఆ సీన్‌కు బలం వస్తుందని చాలా మంది కథానాయకులు నమ్ముతున్నారు. ఇప్పుడున్న టాప్ హీరోలంతా బాడీ మీద పోకస్ పెట్టి సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ బిల్డప్ చేశారు. బాలీవుడ్‌లో ఈ సిక్స్‌ప్యాక్ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. దాన్ని టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఫాలో అయ్యారు.
ఈ మధ్య లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ సిక్స్‌ప్యాక్ హీరోలకు బాగా పెరుగుతుంది. అల్లుఅర్జున్, నితిన్, ప్రభాస్, రానా, రామ్‌చరణ్, ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలతో పాటు అప్‌కమింగ్ స్టార్స్‌లో ఒకరైన కార్తికేయా కూడా తన మొదటి సినిమా ఆర్‌ఎక్స్ 100లోనే తన బాడీని చూపిండాడు. మరింత కసరత్తులు చేసి కళ్లు చెదిరే లుక్‌లో తన కొత్త సినిమా రాజావిక్రమార్కలో కనిపించబోతున్నారు. ఆ సినిమా పోస్టర్లలో టీషర్ట్‌లోనే కనిపిస్తున్న హీరో బాడీ మాత్రం సూపర్‌గా ఉంది. కండలు తిరిగి, నారాలు ఉప్పొంగి లేడీ ఫ్యాన్స్ మనసును దొచుకునేలా ఉన్నాడు.