దర్శకుడు రాజమౌళి ప్రతి విజయం వెనుక భార్య రమా రాజమౌళి ఉందని ఎన్నో సార్లు చెప్పారు. అయితే ఆయన ప్రతి సినిమాలో కూడా కుమారుడు కార్తికేయ కూడా కీలక పాత్ర పోషిస్తుంటాడు. కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రాజమౌళి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు.
దర్శక ధీరుడు, స్టార్ డైరెక్టర్, ఓటమి ఎరుగని ఫిల్మ్ మేకర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ సీన్‌ను ఫరెఫెక్ట్‌గా చిత్రీకరిస్తాడని అందుకోసం ఎంతైనా కష్టపడతాడని అతనితో పని చేసిన నటీనటులు, టెక్సీషియన్స్ అంటుంటారు. అందుకే అతడికి పని రాక్షసుడిగా, జక్కన అనే ముద్ర కూడా పడింది. స్టూడెంట్ నం.1 నుండి మొదలైన ఆయన ప్రయాణం.. ఆర్ఆర్ఆర్ వరకు కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో అప్పటి వరకు భారత్ అంటే తెలియని వారు సైతం..మన వైపు చూసేలా చేసిన దర్శకుడు జక్కన్న. అయితే ఆయన సక్సెస్ పొందిన ప్రతి సారి కూడా తన విజయంలో సగ భాగం భార్య రమకు చెందుతుందని చెబుతూ ఉంటారు. అయితే అసలు రమాకు రాజమౌళి రెండవ భర్త అన్న విషయం అందరికీ తెలిసిందే.
రాజమౌళి ప్రతి సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు రమా రాజమౌళి. అయితే రాజమౌళి, రమాల కుమారుడు కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలు వెల్లడించారు. రాజమౌళి సినిమాల మార్కెటింగ్ వ్యవహారాలలో కార్తికేయ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాను మార్కెటింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. కాగా, కార్తికేయ రమా మొదటి భర్తకు పుట్టిన బిడ్డ కావడం గమనార్హం. అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం రూ. 80 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారంటూ.. వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై కాంట్రవర్సీ కూడా నడిచిందనుకోండి. అదీ వేరే విషయం. అయితే ఈ వార్త ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పారు కార్తికేయ. ఆస్కార్ కోసం ఆ స్థాయిలో ఎవరూ ఖర్చు చేయరని చెప్పుకొచ్చారు. అలాగే రాజమౌళి గురించి ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.
‘అమ్మ, బాబా (రాజమౌళిని కార్తికేయ అలా పిలుస్తారు) పెళ్లి జరగడానికి ఏడాది ముందు నుండి మా ఇంటికి వచ్చే వారు. అప్పుడు నాకు 8 ఏళ్లు. నన్ను, అమ్మను రాజమౌళి డిన్నర్ కు తీసుకెళ్లేవారు. ఒక రోజు రాకపోతే.. నేనే ఫోన్ చేసేవాడిని. అప్పుడు ఆయన సీరియల్స్ చేసేవాడు. కుదరలేదు అని చెబితే. రేపొస్తావా అంటూ అడిగేవాడిని. అప్పడి నుండే ఆయనపై తండ్రి ఫీలింగ్ వచ్చింది. దీంతో తండ్రి వైబ్ వచ్చింది. పెళ్లి అయ్యాక ఇదే కదా అవ్వాల్సిందీ అని ఫీలయ్యాను’ అని చెప్పారు. వాళ్లు పెళ్లి చేసుకుందామని చెప్పడానికి ముందు నుండే మెంటల్ గా అతనిని తండ్రిగా ఫిక్స్ అయ్యానని, అయితే ఇప్పటికే నాన్న అని పిలవనని, బాబా అని పిలవడం అలవాటుగా మారిపోయిందన్నారు. అదేవిధంగా భార్య పూజ.. మంచి గాయని అని సినిమాలలో పాడాలని కోరినా పాడటానికి పూజ ఆసక్తి చూపడం లేదని కార్తికేయ కామెంట్లు చేశారు. కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలు పంచుకున్నారు.