హీరోలే సిక్స్ ప్యాక్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అలాంటిది ట్రైనర్ ని పెట్టుకున్న కొన్ని నెలల్లోనే ఇలాంటి లుక్ తో దర్శనమిచ్చింది హీరోయిన్ తాప్సీ. ఇంతకీ ఏంటి విషయం?
సాధారణంగా హీరోయిన్లు అనగానే జీరో సైజ్ లుక్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. లేదంటే కాస్త ఒంపు సొంపులతో వయ్యారాలు ఒలకబోస్తూ ఉంటారు. సినిమాలు చేయడం మానేస్తే కాస్త బరువు పెరుగుతారు. మహా అయితే వర్కౌట్స్ చేస్తారు, బాడీని ఫిట్ గా ఉంచుకుంటే.. అంతకు మించి ప్రయోగాలు చేయరు. కానీ స్టార్ హీరోయిన్ తాప్సీ మాత్రం అసలు ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని విధంగా దర్శనమిచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే టైంలో రీజన్ ఏంటని కూడా తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలో పుట్టి పెరిగిన తాప్సీ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ‘ఝుమ్మంది నాదం’ అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. అలా ఓ మూడేళ్లపాటు టాలీవుడ్ లోనే వరస సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది. ఫస్ట్ లో కమర్షియల్ చిత్రాలు చేసినప్పటికీ.. రీసెంట్ టైంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ గా మారిపోయింది. చివరగా తెలుగులో ‘మిసన్ ఇంపాజిబుల్’ ఓ పాత్రలో నటించిన తాప్సీ.. ప్రస్తుతం తమిళ, హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటి ఈమె.. తాజాగా సిక్స్ ప్యాక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొన్ని నెలల నుంచి ట్రైనర్ ని పెట్టుకున్న తాప్సీ.. నెలకు ఏకంగా ఓన్లీ దీని కోసమే రూ.లక్ష వరకు ఖర్చు పెడుతోంది. తాజాగా తన ట్రైనర్ తోపాటు తీసుకున్న రెండు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో తాప్సీ ఫిజిక్ చూసి అందరూ స్టన్ అవుతున్నారు. ఎందుకంటే హీరోల్లో చాలా తక్కువమంది సిక్స్ ప్యాక్ మెంటైన్ చేస్తుంటారు. అలాంటి ఈమెకి రావడం ఏంట్రా బాబు అని అనుకుంటున్నారు. ఇది షారుక్ తో చేస్తున్న ‘డంకీ’ మూవీ కోసమే అని తెలుస్తోంది. ఫిట్ గా ఉండేందుకే తాప్సీ ఇలా మారిందని అంటున్నారు. ఏదేమైనా స్టార్ హీరోయిన్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. మరి తాప్సీ ఫిట్ నెస్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.