టీమిండియా స్టార్ క్రికెటర్ ఒకరు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటో చూసిన అతడి లేడీ ఫ్యాన్స్ సూపర్బ్‌గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్లో ఇప్పుడో యువ ఆటగాడు సంచనాలు సృష్టిస్తున్నాడు. ఆడిన ప్రతి ఫార్మాట్లోనూ, టోర్నీలోనూ తన అసామాన్య ప్రతిభతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. నీళ్లు తాగినంత సులువుగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. అతడే టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్. క్లాస్ ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు గిల్. కూల్‌గా ఆడుతూ మ్యాచ్‌లను ఫినిష్ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు గిల్. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గిల్ (104 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆర్సీబీ నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు గిల్. ప్లేఆఫ్స్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ శిబిరంలో మరింత జోష్ నింపాడు.
ప్లేఆఫ్స్‌లోనూ శుబ్‌మన్ గిల్ ఇలాగే చెలరేగి ఆడితే గుజరాత్ టైటాన్స్‌కు తిరుగుండదు. అయితే గిల్ ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ ఓడిపోయిందని ఆ జట్టు ఫ్యాన్స్ అంటున్నారు. ఆర్సీబీ ఓడితేనే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది కాబట్టి.. ముంబై ఓనర్ ముఖేష్ అంబానీ, టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్‌తో గిల్ చేతులు కలిపాడని కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ప్రమాదానికి గురైన ఒక కారు ఫొటోను షేర్ చేసి.. అందులో గిల్‌తో పాటు అతడి సోదరి కూడా ఉంటే బాగుండు అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం ఇవేవీ పట్టనట్లుగానే ఉంటున్నాడు. ప్లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్న అతడు.. తాజాగా సోషల్ మీడియాలో ఒక సెల్ఫీని పోస్ట్ చేశాడు. షర్ట్ తీసేసి టవల్‌పై ఉన్న ఈ ఫొటోలో గిల్ తన సిక్స్ ప్యాక్‌ను చూపిస్తున్నాడు. అతడి బాడీకి లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏంటి గిల్ ఇంత ఫిట్‌గా ఉన్నావ్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అతడ్ని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ మ్యారేజ్ ప్రపోజల్స్ పెడుతున్నారు.
थर्स्ट-trap pic.twitter.com/vKEUs5RoVH
— Shubman Gill (@ShubmanGill) May 22, 2023