తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారతీయ చలన చిత్ర రంగాన్ని అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత రాజమౌళికే దక్కుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నోఅద్భుత చిత్రాలు తెరకెక్కించిన రాజమౌళి ఈగ మూవీతో గ్రాఫిక్ మాయాజాలం చేసి అందరినీ అబ్బురపరిచాడు. బాహుబలి సీరీస్ తో జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో నిరూపించాడు. ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఎన్నో సరికొత్త రికార్ట్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం గ్లోబల్ వేధికలపై ఆర్ఆర్ఆర్ సత్తా చాటుతుంది.
బుల్లితెరపై శాంతినివాసం సీరియల్ తో డైరెక్టర్ గా తన ప్రస్థానం పెట్టాడు ఎస్ఎస్ రాజమౌళి. వెండితెరపై తన మొదటి చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. మరోసారి ఎన్టీఆర్ హీరోగా ‘సింహాద్రి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాజమౌళి. ఇలా ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఓటమి ఎరుగని దర్శకధీరుడగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి సీరీస్ తో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు. బాహుబలి రిలీజ్ అయిన అన్ని దేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక పాన్ ఇండియా మూవీగా యన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సైతం ప్రపంచ స్థాయిలో దుమ్మురేపింది.
ఆర్ఆర్ఆర్ మూవీతో దర్శకధీరుడు రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు. ఈ మూవీ చూసి హాలీవుడ్ సినీ ప్రముఖులు, టెక్నీషియన్స్ రాజమౌళి పనితీరుపై ప్రశసంలు కురిపించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఈ క్రమంలోనే ఆయన అరుదైన గౌరవం దక్కించుకున్నారు. లాస్ ఏంజెల్స్ లో 13వ వార్షిక గవర్నర్ అవార్డు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. నవంబర్ 19 న లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డు వేడుకకు రాజమౌళి స్టైలిష్ బ్లాక్ సూట్ లో హాజరయ్యాడు. ఆయనతో పాటు కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ అవార్డు వేడుకలో సందడి చేశారు.
దర్శకుడు రాజమౌళి ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్ లో చాలా సింపుల్ లుక్ తో కనిపిస్తుంటారు. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా.. పెద్దగా హంగులూ ఆర్భాటాలకు వెల్లకుండా సింప్లిసిటీ చాటుకుంటాడు. అలాంటది అమెరికాలో జరిగిన గవర్నర్స్ అవార్డ్స్ ఈవెంట్ కు బ్లాక్ సూట్ ధరించిన రాజమౌళి క్లాసీ లుక్ తో హాలీవుడ్ ప్రముఖల మద్య హైలెట్ గా కనిపించారు. ఈ సందర్భంగా పలు లోకేషన్ లో రాజమౌళి, కార్తికేయ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను కార్తీకేయ ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రస్తుతం బ్లాక్ సూట్స్ లో తండ్రీ కొడుకుల రాయల్ లుక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. వచ్చే ఏడాది మహేష్ బాబు తో భారీ బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
THE DIRECTOR!! 🤘🏻🤘🏻🤘🏻🤘🏻 https://t.co/Px1lAfM2AP
— RRR Movie (@RRRMovie) November 20, 2022
❤️🔥❤️🔥❤️🔥 @ssrajamouli pic.twitter.com/V3ZNratBtg
— S S Karthikeya (@ssk1122) November 20, 2022