సినీ నటీమణులు హేమ, సురేఖా వాణిల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సురేఖా వాణి ప్రస్తుతం సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తొంది. కూతురు సుప్రీతతో కలిసి ఆమె చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ తల్లికూతుళ్ల మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. ఇక హేమ విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక అప్పుడప్పుడు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది హేమ. ఏ విషయం గురించి అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడుతూ.. వివాదాల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హేమ. అది కూడా తోటి నటి సురేఖా వాణి గురించి. ప్రస్తుతం హేమ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా హేమ ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇండస్ట్రీలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే.. నేను ఫస్ట్ చెప్పేది సురేఖా వాణి పేరే. మేం మాత్రమే కాక.. మా పిల్లలు ఈషా, సుప్రీతా కూడా ఇద్దరు మంచి స్నేహితులు. చక్కగా కలిసి మెలిసి ఉండేవారు. అయితే వారిద్దరి స్నేహాన్ని చూసి సురేఖా వాణి ఓర్వలేకపోయింది. ఈషా, సుప్రీతాలను విడగొట్టింది’’ అంటూ సంచలన ఆరోపణలు చేసింది హేమ.
అంతేకాకుండా.. ‘‘మా పిల్లలు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు. దాంతో సురేఖా వాణి సుప్రీతను వేరే స్కూల్‌కి మార్పించింది. అయినా సరే సుప్రీత మళ్లీ ఈషా చదివే స్కూల్‌కే వచ్చింది. ఎందుకంటే సుప్రీత చాలా బోల్డ్‌గా ఉంటుంది. ప్రస్తుతం నేను సురేఖా వాణిని దూరం పెట్టాను. ఇంతకు ముందులా క్లోజ్ గా ఉండటం లేదు. ఎందుకంటే.. నేను షూటింగ్స్‌లో ఉన్నప్పుడు తను నా గురించి కొంతమందికి చెడుగా చెప్పింది. ఆ విషయాలు నాకు తెలిసి చాలా బాధపడ్డాను. అందుకే ప్రస్తుతం తనను దూరం పెట్టాను’’ అని చెప్పుకొచ్చింది హేమ.
సురేఖ వాణితో పాటు.. ఆమె కూతురు సుప్రీతపై నటి హేమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి వీటిపై సురేఖ వాణి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక తాజాగా సురేఖ వాణి … కూతురు సుప్రిత బర్త్ డే పార్టీని గ్రాండ్‌గా చేసింది. అయితే దీనిపై చాలామంది నెటిజనులు ట్రోల్ చేశారు. కారణం సురేఖా వాణి తానే స్వయంగా కుమార్తె చేత డ్రింక్ చేయించింది. ఇది చూసిన నెటిజనులు.. వీరిద్దరిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి ప్రస్తుతం హేమ.. సురేఖా వాణి గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.