విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోక వనంలో అర్జున కల్యాణ్’ సినిమా ప్రమోషన్స్ లో పుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఫిలిం నగర్లో ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం చేసిన ప్రాంక్ వీడియో విశ్వక్ సేన్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ వీడియోపై అడ్వకేట్ ఒకరు మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. నడి రోడ్డులో అలా న్యూసెన్స్ చేయడంపై చర్యలు తీసుకోవాలంటూ విశ్వక్ సేన్ పై ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు విశ్వక్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ప్రముఖ మీడియా హౌస్ కు ఇంటర్వ్యూకి వెళ్లిన విశ్వక్ యాంకర్ తో గొడవకు దిగాడు. లైవ్ లోనే ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు.
ఇదీ చదవండి: కష్టాల్లో హీరో విశ్వక్ సేన్! HRC లో ఫిర్యాదు!
ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ టీవీ ఛానల్ కు హీరో విశ్వక్ సేన్ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వెళ్లాడు. అక్కడ యాంకర్ గా ఉన్న దేవీ నాగవల్లితో విశ్వక్ కు గొడవ జరిగింది. విశ్వక్ సేన్ పై నమోదైన కేసు విషయం ప్రస్తావిస్తూ యాంకర్.. విశ్వక్ ను డిప్రెస్డ్ పర్సన్, పాగల్ సేన్ అని పిలవడాన్ని అతను తీవ్రంగా ఖండించాడు. అలా పిలవకండి అని గట్టిగా చెప్పాడు. మధ్యలో బూతులు కూడా ఉపయోగించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. విశ్వక్ స్పందించిన తీరుకు తగ్గట్లుగానే యాంకర్ కూడా గెట్ అవుట్ ఫ్రమ్మై స్డూడియో అంటూ ఫుల్ ఫైర్ అయిపోయింది. విశ్వక్ సేన్ సైతం నాకున్న లీస్ట్ ఇంట్రస్ట్ మీ స్డూడియోకి రావడం అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం ఎన్నో టీవీ షోస్, ఇంటర్వ్యూలలో సైతం ఇలాంటి ప్రోమోలు చేయడం చూస్తున్నాం. టీఆర్పీ, వ్యూవర్షిప్ కోసం ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి మొదట ప్రోమో రిలీజ్ చేసి ఆ తర్వాత షోపై హైప్, సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తుంటారు. ఇది కూడా అలాగే సినిమా ప్రమోషన్ కోసం చేశారా? లేక నిజంగానే విశ్వక్ అలా స్టూడియో నుంచి వెళ్లిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. ఇంక సినిమా విషయానికి వస్తే.. 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాని ఓ కుర్రాడి పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నాడు. అదే లైన్ లో ఈ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా సాగనుంది. విశ్వక్ సేన్- దేవీ నాగవల్లి మధ్య జరిగిన సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
TV9 Devi lost completely. She called Viswaksen Mentally ill, then he condemned the words. So, she shouted and thrown him out the debate. @VishwakSenActor
We are supporting Viswaksen. Devi Nagavalli must apologise to Viswak Sen @TV9Telugu
— Censor Reports 💎 (@CensorReports) May 2, 2022