ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం పలు అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుతోంది. ఇక తాజాగా హలీవుడ్ క్రిటిక్స్ అసోసియన్ అవార్డ్స్-2023లో కూడా ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, జక్కన్నల క్రేజ్ ఖండాంతరాలను తాకింది. ఇండియాలో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ఈ చిత్రం.. అంతర్జాతీయ వేదికల మీద కూడా సత్తా చాటుతోంది. ఆస్కార్ కోసం పోటీ పడుతున్న చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకోగా.. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్ ఖాతాలో చేరింది. కాలిఫోర్నియా వేదికగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులు సొంతం చేసుకుంది. అయితే ఈ అవార్డుల వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు క్షమాపణలు తెలిపారు. ఎందుకు అంటే..
కాలిఫోర్నియాలో నిర్వహించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ అమెరికన్ నటి టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక కార్యక్రమంలో భాగంగా ఓ కేటగిరీ అవార్డ్ ప్రదానం చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని వేదిక మీదకు ఆహ్వానించారు. అయితే చెర్రీని వేదిక మీదకు పిలిచే క్రమంలో ఆయన పేరు సరిగా పలకరాక.. నొటారో ఇబ్బంది పడ్డారు. రామ్ అని పిలిచి.. ఆ తర్వాత చరణ్ పదాన్ని పలకడం రాక తడబడ్డారు. రామ్ చరణ్‌కు క్షమాపణ చెప్పారు.
‘‘ఆర్‌ఆర్‌ఆర్’తో సూపర్ సక్సెస్ అందుకున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సూపర్‌స్టార్ రామ్..’ అంటూ చరణ్ అనే పదాన్ని ఎలా పలకాలో తెలియడం లేదని అన్నారు నొటారో. అనంతరం స్టేజ్ వెనుక ఉన్న బృందం సాయంతో చరణ్ అని కష్టంగా పలికారు. కానీ రామ్ చరణ్ మాత్రం దీన్ని పట్టించుకోకుండా చిరునవ్వుతో స్టేజ్ మీదకు వెళ్లి హుందాగా ప్రవర్తించారు. ఆ వెంటనే రామ్‌చరణ్ వద్దకు వెళ్లి క్షమాపణ తెలియజేశారు టిగ్ నొటారో. అనంతరం హాలీవుడ్ నటి యాంజలీ భీమానికి బెస్ట్ వాయిస్, మోషన్ క్యాప్చర్ అవార్డును అందించాడు రామ్ చరణ్. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరలవుతోంది.
‘ MAN OF MASSES RAM CHARAN ‘
❤️🔥🔥 For a Reason 🙌He’s True GLOBAL Phenomenon 😎
The International Film Superstar @AlwaysRamCharan‘s Aura at #HCAFilmAwards ❤️🔥#GlobalStarRamCharan @HCAcritics#GlobalstarRamcharan pic.twitter.com/v8PxuhZ4Pg— RC YuvaShakthi (@RcYuvaShakthi) February 25, 2023
ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తూ.. పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. దీనిలో భాగంగానే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆరవ ఎడిషన్ అవార్డు వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ఐదు కేటగిరిలో అవార్డులు దక్కాయి. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్, బెస్ట్ స్పాట్‌లైట్ విభాగాలకు సంబంధించి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఐదు అవార్డులు అందాయి. మరి ట్రిపుల్ ఆర్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.