చిరునవ్వుతో సినిమా గుర్తుందా..? 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు కథను, మాటలను అందించడం విశేషం. ఈ సినిమాతోనే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ ఈ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. తొలుత నువ్వేకావాలి విడుదలైంది.
చలన చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతో ఎంత పాపులారిటీ తెచ్చుకుంటారో.. మరో సినిమాతో పరిశ్రమకు దూరం అవుతుంటారు కొంత మంది నటీమణులు. చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలో కనిపిస్తున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాక లేదంటే మ్యారేజ్ లైఫ్‌లోకి అడుగు పెట్టి చిత్ర పరిశ్రమ నుండి దూరం జరుగుతుంటారు. అటువంటి వారిలో ఒకరు చిరునవ్వుతో హీరోయిన్. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను, మాటలను అందించడం విశేషం. ఈ సినిమాలో ప్రతి డైలాగ్.. ఓ ఆణిముత్యం. ఈ సినిమాతోనే ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ పరిచయమైనప్పటికీ.. తొలుత నువ్వేకావాలి విడుదలైంది.
స్వయం వరంతో నటుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే హిట్ ను తన ఖాతాలో వేసుకున్న హీరో తొట్టెంపూడి వేణు. అతడి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనస్సు పడ్డాను కానీ వచ్చింది..ప్లాప్ అయ్యింది. ఆ సమయంలో తొలి సినిమా నిర్మాత శ్యామ్ ప్రసాద్..జి.రామ్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్లుగా షహీన్ ఖాన్, ప్రేమ నటించారు. చిన్న సినిమా వచ్చిన.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా నాలుగు నంది అవార్డులను కొల్లగొట్టడమే కాదూ.. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోకి ఈ సినిమా రీమేక్ అయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్గా నటించింది షహీన్ ఖాన్. హిందీ మినహా మిగిలిన మూడు భాషల్లో ఆమెనే సంధ్య క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో చాలా క్యూట్ లుక్స్ తో నాజూగ్గా కనిపిస్తూ మెస్మరైజ్ చేసింది.
మోడల్ అయిన షహీన్.. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ మ్యూజిక్ వీడియోస్‌లో కనిపించింది. హీరోయిన్లకు గుర్తింపునిచ్చే యాడ్ ఫెయిర్ అండ్ లవ్లీలో కూడా మెరిసింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అందం. ఈ సినిమా కన్నడ రీమేక్ చేయగా.. అగ్ర నటుడు రవిచంద్రన్, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన నటించింది. ఈ రెండు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో డార్లింగ్, డార్లింగ్ అనే మూవీలో చివరిగా కనిపించింది. ఆ తర్వాత వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆమెకు ఓ కూతురు. కానీ ఇప్పుడు చూసిన ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ఫిట్ నెస్, ఇతర విషయాలను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది ఈ భామ.