తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది బాలీవుడ్ బ్యూటీలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి తక్కువ మందే సక్సెస్ సాధించారు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంది. తెలుగు లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దేశముదురు’చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో హన్సికకు వరుస ఆఫర్లు వచ్చాయి. 2011లో ‘మాప్పిళ్త్లె’ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తున్న హన్సిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం హన్సిక ఇంట పెళ్లిసందడి మొదలైంది. ఈ క్రమంలో కాబోయే భర్తలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లు వివాహబంధంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో నటి హన్సిక కూడా పెళ్లిచేసుకోబోతుంది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తో ప్రేమలో పడిన హన్సిక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబాయిలో మంగళవారం హన్సిక ఇంట ‘మాతా కీ చౌకి’ కార్యక్రమాన్ని నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కాబోయే వధూవరులు ఇద్దరూ పాల్గొని పూజచేశారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.
పూజా కార్యక్రమంలో హన్సిక కాబోయే భర్త సోహైల్ సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. ఈ సందర్భంగా సోహైల్ ని ప్రేమతో కౌగిలించుకున్న హన్సిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి హన్సిక ఇటీవల పలు వ్యాపారంగంలోకి ప్రవేశించింది. సోహైల్ ఆమె వ్యాపారంలో భాగస్వామిగా ఉంటున్నాడు. చాలా కాలంగా వీరిద్దరూ స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో వీరి మద్య ప్రేమ చిగురించింది. పెద్దలను ఒప్పించి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు. డిసెంబర్ 4 న ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
రాజస్థాన్ జైపూర్ లో ప్రసిద్ది చెందిన రాజకోట పెళ్లి వేదిక కానుంది. ఈ కోటకు వచ్చే అతిధుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు కుటుం సభ్యులు తెలిపారు. ఇటీవల చెన్నైలోని కాళియంబుల్ ఆలయ దర్శనం చేసుకుంది హన్సిక. ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. హన్సిక-సోహైల్ పూజాలో పాల్గొన్న ఫోటోలు.. వీడియో సోషల్ మీడియాల వైరల్ అవుతున్నాయి.