తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగన హన్సిక గురించి, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాపులర్ కమెడియన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్‌లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా రచ్చ రచ్చ అయిపోతుంటుంది. తర్వాత వివరణ ఇచ్చుకోలేక నానా తంటాలు పడాలి. రీసెంట్‌గా హీరోయిన్ హన్సిక గురించి ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ యాక్టర్ పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అతనే ‘రోబో’ శంకర్. తమిళంలో కమెడియన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శంకర్. పెళ్లి తర్వాత హన్సిక నటిస్తున్న కోలీవుడ్ మూవీ ‘పార్ట్‌నర్’. ఆది పినిశెట్టి హీరో. మనోజ్ దామోధరన్ డైరెక్టర్. ఇందులో ‘రోబో’ శంకర్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన హన్సిక గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
‘పార్ట్‌నర్’ షూటింగ్‌లో హన్సిక తన కాలు తాకేందుకు ఒప్పుకోలేదని, డైరెక్టర్ ఎంత బ్రతిమాలినా కానీ వినలేదని, ఆమె తీరుతో అందరం షాకయ్యామని చెప్పుకొచ్చాడు. దీంతో ‘రోబో’ శంకర్ వ్యాఖ్యలపై మీడియా పర్సన్స్ మండిపడ్డారు. అతనికి మర్యాద, సినిమా పట్ల నైపుణ్యం లేవంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఫైర్ అయ్యారు. అయితే ‘రోబో’ శంకర్ జాండీస్ బారిన పడ్డారని, ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారని సమాచారం.
హన్సిక గతేడాది ప్రియుడు సోహైల్ కతూరియాను వివాహం చేసుకుంది. తెలుగులో ఫేడౌట్ అయిపోయాక తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది. కోలీవుడ్‌లో స్టార్ హీరో శింబుతో ఎఫైర్ నడిపి వార్తల్లో నిలిచింది. ఈ జంట ఓపెన్‌గానే ప్రేమాయణం నడపడంతో పెళ్లి చేసుకుంటారనుకున్నారు తమిళ్ తంబీలు. కట్ చేస్తే బ్రేకప్ చెప్పేసుకున్నారు. అల్లు అర్జున్ ‘దేశముదురు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత ‘కంత్రి’, ‘బిల్లా’ వంటి పలు సినిమాల్లో కనిపించింది.