ఏ రంగంలోనేనా రాణించాలంటే దానికి తగిన కృషి చేయాలి. అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎదుటి వ్యక్తులు మనల్ని గౌరవించాలన్నా, వారితో మనం గౌరవించబడాలన్నా జీవితంలో విజయం సాధించి తీరాల్సిందే. అలా లేని పక్షంలో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ తనకు జరిగిన అవమానాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
హన్సిక మొత్వాని టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్. తన అందంతో కుర్రళ్ల మదిని దోచుకుంది హన్సిక. తన గ్లామర్, అభినయంతో అభిమానుల గుండెల్లో గూడు ఏర్పర్చుకుంది. అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో నటించిన హన్సిక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పలువురు హీరోలతో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఇటీవల తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
అయితే తను సినిమారంగంలోకి వచ్చిన తొలి రోజుల్లో కొంతమంది చూలకనగా చూశారని, ఆ తరువాత తను స్టార్ హీరోయిన్ అయ్యాక ఎవరైతే చిన్నచూపు చూశారో వారే తిరిగి తనను గౌరవిస్తున్నారని తెలిపింది. అసలేం జరిగిందో తన మాటల్లో ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సినిమా ఫంక్షన్ల కోసం డ్రెస్సులు కావాలిని డిజైనర్లను అడిగినప్పుడు, వారు అసలు స్సందించేవారు కాదని తెలిపింది. ఇంకొంతమంది అయితే మీరు సౌత్ ఇండియా యాక్టర్ కాబట్టి మీకు డ్రెస్సులు డిజైన్ చేయమని నిర్మొహమాటంగా చెప్పేవారని వెల్లడించింది.
కానీ ఇప్పుడు నే స్టార్ హీరోయిన్ అయ్యాక వారే వచ్చి మేము డిజైన్ చేసిన డ్రెస్సులు వేసుకోవచ్చు కదా’ అంటూ బ్రతిమిలాడుతున్నారని తెలిపింది. హీరోయిన్ గా వచ్చిన తొలి రోజుల్లో వారు నాపట్ల నడుచుకున్న తీరుకు, స్టార్ హీరోయిన్ అయ్యాక వారు చూపే గౌరవానికి చాలా తేడా ఉంది ని తెలిపింది. వాళ్లు చిన్న చూపు చూసినపుడు వారిపై ద్వేశం పెంచుకోలేదని, కెరీర్ పై దృష్టి పెట్టి నటనలో రాణించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నానని తెలిపింది. దీంతో అప్పుడు చూలకనగా, చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు వారు డిజైన్ చేసిన డ్రెస్సులను వేసుకోవాలని బ్రతిమిలాడుతున్నారని తెలిపింది.