ఆయన చేసినన్ని భిన్న పాత్రలు.. ప్రయోగాలు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవ్వరూ చేయలేదని చెప్పొచ్చు. ఆయన నటనకు సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో దేశం గర్వించ దగ్గ నటులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పాత్ర ఏదైనా తమ నటనతో ప్రాణం పోయటం వారి గొప్పతనం. అలా వారు చేసిన పాత్రలు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. పైన ఫొటోలో మహానటి సావిత్రితో పాటు కనిపిస్తున్న ఆ పిల్లాడు కూడా నటనలో లెజెండ్ అనిపించుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ యాక్షన్ సీన్స్‌లో అదరగొడుతున్నాడు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన హీరోగా మారి.. తన నటనతో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగిస్తున్నాడు.
దాదాపు 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలు చేశాడు. అయితే, సినిమా జీవితంలో సూపర్ సక్సెస్ అయిన ఈయన.. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్ అయ్యాడు. చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఆయన 60 ఏళ్ల వయసులో ఓ రాజకీయ పార్టీని మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలే జీవితంగా బతుకుతున్నారు. మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఆ హీరో ఇంకెవరో కాదు.. లోక నాయకుడు కమల్‌హాసన్.
కమల్ హాసన్ 1960లో వచ్చిన ‘కలాదూర్ కన్నమ్మ’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో సావిత్రి కుమారుడిగా నటించారు. బాల నటుడిగా ఆరుకుపైగా సినిమాల్లో నటించారు. దర్శకుడు బాలచందర్..కమల్‌కు హీరోగా లైఫ్ ఇచ్చారు. వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్లు సినిమా తెరకెక్కాయి. కమల్ తెలుగునూ సినిమాలు చేశారు. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, సింగర్‌గా, మేకప్ మ్యాన్‌గా తన సత్తా చాటారు. ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దశావతారం సినిమాతో ఎవ్వరూ చేయని సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.