వారసత్వంతో సినిమాల్లోకి రావొచ్చు కానీ.. అవి కొంత వరకు మేలు చేస్తాయి. తమ నటన, టాలెంట్‌ను నిరూపించాల్సిందే. ఏమాత్రం పస లేకపోతే ప్రేక్షకులు ఇంటికి పంపించడం ఖాయం. అల్రెడీ ఆ విషయం అనేక మంది నటీనటుల విషయాల్లో ప్రూవ్ అయ్యింది. అయితే..
సినిమా పరిశ్రమలో నటీనటుల వారసులు.. ఇదే పరిశ్రమలోకి రావడం పరిపాటి. వారసత్వంతో సినిమాల్లోకి రావొచ్చు కానీ.. అవి కొంత వరకు మేలు చేస్తాయి. తమ నటన, టాలెంట్‌ను నిరూపించాల్సిందే. ఏమాత్రం పస లేకపోతే ప్రేక్షకులు ఇంటికి పంపించడం ఖాయం. అల్రెడీ ఆ విషయం అనేక మంది నటీనటుల విషయాల్లో ప్రూవ్ అయ్యింది. అలాగే నటనతో ఆకట్టుకుంటే.. నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటారు అభిమానులు. చివరకు మనం మాట్లాడుకునే నటుడు విషయంలో అది అక్షర సత్యమైంది. చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమకు వచ్చినప్పటికీ.. స్టార్‌గా ఎదిగేందుకు ఎంతో కష్టపడ్డాడు. చివరికీ అతడి టాలెండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఆ కష్టానికి ప్రతి ఫలం కూడా దక్కింది.
ఇక్కడ ముగ్గురు చిన్నారులు కనిపిస్తున్నారు కదా. వీరిలో ఎడమ వైపు కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టగలరా.. బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ చిన్నారి మరెవ్వరో కాదూ.. తొలిసారిగా ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమాలోని హీరోల్లో ఒకరు. అతడే మన అల్లరి రాముడు, స్టూడెంట్ నెంబర్ వన్, బాద్ షా జూ.ఎన్టీఆర్. కేవలం 18 ఏళ్ల ప్రాయంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు జూ ఎన్టీఆర్.. అలియాస్ తారక్. తాత సీనియర్ ఎన్టీఆర్, బాబాయి బాలకృష్ణ, తండ్రి హరికృష్ణ స్టార్ నటులైనా.. ఆయన చిన్న చిత్రంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా నిన్ను చూడాలని ఆడకపోయినప్పటికీ వెనుకంజ వేయలేదు. గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు ఆయన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
స్టూడెంట్ నంబర్ 1 తోపాటు ఆది వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు తారక్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి తడబడ్డా.. మళ్లీ పైకి లేచాడు. యంగ్ టైగర్ గా అవతరించాడు. బృందావనం, బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జాతీయ స్థాయిలోనే కాదూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. నటనే కాదూ డ్యాన్సులు, డైలాగులు చెప్పడంలో దిట్ట. మాసైనా,క్లాసైనా ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని వారుండరు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర సినిమా పోస్టర్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో ఊరమాస్ అవతారంలో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.