సక్సెస్ వచ్చేవరకూ కష్టాలు తప్పవు. ఎవరైనా సరే కష్టాలు పడాల్సిందే. వన్స్ సక్సెస్ మనల్ని మీట్ ఐతే.. ఇక సక్సెస్ మీట్ లే ఉంటాయి. బాగా కష్టాలు పడి.. సక్సెస్ అయితే వచ్చే కిక్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఆ కిక్ ని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు బోలెడంత ఆస్తి ఉండేది. నాన్న చేసిన తప్పుల వల్ల ఆ ఆస్తి అంతా పోయింది. అయితేనేం.. డైరెక్టర్ గా సక్సెస్ అయ్యి బోలెడంత ఆస్తి సంపాదించారు. బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ అయిన జోష్ లో ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
వీర సింహారెడ్డి సినిమా ముందు తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా క్రాక్ అని, అయితే ఆ విజయాన్ని చూడకుండా తన తండ్రి మరణించారని భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తండ్రి ఎప్పుడూ బాలకృష్ణతో సినిమా చేయమని అనేవారని, మాస్ హీరోతో సినిమా చేస్తే చూడాలని ఉందిరా అని అనేవారని చెప్పుకొచ్చారు. కానీ బాలయ్యతో వీర సింహారెడ్డి సినిమా చేసి.. మాసివ్ హిట్ కొట్టినా చూడడానికి తన తండ్రి లేనందుకు బాధపడ్డారు గోపీచంద్. అయితే తన తండ్రి కలను నిజం చేసినందుకు సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక తన తండ్రి వల్ల 30 ఎకరాలకు పైనే పోయాయని చెప్పుకొచ్చారు. తన చిన్నతనంలో ఉండగా.. ఒంగోలు నుంచి కావలి వెళ్లే హైవే దగ్గర 20 ఎకరాలు ఉండేవట.
అయితే తన తండ్రి ఫ్రెండ్స్ కి మద్యం పార్టీ ఇవ్వడం కోసం అప్పు చేసేవారని.. ఆ అప్పు తీర్చడానికి పొలం ఇచ్చేసేవారని, 7 వేలకి, 10 వేలకి పొలం రాసిచ్చేవారని భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఊహ తెలిసే సమయానికి 40 ఎకరాల నుంచి 4 ఎకరాలకు వచ్చేసామని, చాలా ఆస్తులు పోయాయని అన్నారు. హైవే మీద 20 ఎకరాలు పొలం అంటే ఎంత ఆస్తో లెక్క వేసుకోవచ్చు. అదే మామూలు మనుషులు ఐతే.. హైవే మీద ఒక్క సెంటు భూమి పోయినా ప్రాణం పోయినట్టు భావిస్తారు. నాన్న మీద అరుస్తారు, కోప్పడతారు. కొడుకు కోసం ఏమీ మిగల్చలేదని తిడతారు. కానీ గోపీచంద్ మలినేని అవేమీ పట్టించుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. సక్సెస్ ఫుల్ పర్సన్స్ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. గతం గురించి ఆలోచించరు. ఏం కోల్పోయామన్నదాని గురించి ఆలోచించడం కంటే.. ఏం పొందాలి అని ఆలోచించడం మీదే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.