సన్నీ లియోన్.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక సెన్సేషన్. తన గత జీవితాన్ని వదిలేసి.. ఇప్పుడు ఒక హీరోయిన్‌గా రాణిస్తోంది. ఒక్క బాలీవుడ్‌లోనే కాకుండా.. ఇండియన్ సినిమాలోని చాలా ఇండస్ట్రీల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సన్నీ లియోన్ నటనతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. ఐటమ్ నంబర్స్ కోసం సినిమాల్లో అవకాశాలు ఇచ్చే స్థాయి నుంచి సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకునే వరకు ఎదిగింది. ఇప్పుడు ఉత్తమ నటిగానూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. జిస్మ్, రాగిణీ ఎంఎంఎస్-2 వంటి కెరీర్ స్ట్రాంగ్ చేసుకుంది. తాజాగా మంచు విష్ణు జిన్నా సినిమాతో తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకుంది.
జిన్నా సినిమాతో సన్నీ లియోన్‌కి మంచి పేరు వచ్చింది. రేణుకగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. జిన్నా సినిమాలో సన్నీ వన్ ఉమెన్ షో అంటూ కితాబు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత సన్నీ లియోన్ గురించే అంతా వెతకడం మొదలుపెట్టారు. ఆమె వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొందరి దృష్టి సన్నీ లియోన్ వద్దనున్న కార్ కలెక్షన్ మీద పడింది. ఇన్నాళ్లుగా మోడల్, నటి, వ్యాఖ్యత, డాన్సర్ ఇలా చాలా పాత్రలు పోషించిన సన్నీ ఎంత సంపాదించి ఉంటుంది? ఆమె వద్ద ఎలాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అయితే అసలు సన్నీ లియోన్ వద్ద ఎంత ఖరీదైన కార్ల కలెక్షన్ ఉందో చూద్దాం.
సన్నీ లియోన్ కార్ కలెక్షన్‌లో ఉన్న అత్యంత ఖరీదైన కారు ఇటాలియన్ కంపెనీ మసేరాటీకి చెందిన క్వాట్రోపోర్టే. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా చెప్పొచ్చు. ఈ కారును సన్నీ లియోన్ దాదాపుగా రూ.2.11 కోట్లతో కొనుగోలు చేసింది. ఇది 8 సిలిండర్ పవర్‌ఫుల్ ఇంజిన్‌తో.. 3,799సీసీ గల కారు. అత్యధికంగా 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
సన్నీ లియోన్ వద్దనున్న ఖరీదైనా కార్లలో బీఎండబ్ల్యూ 7 సిరీస్ కూడా ఒకటి. ఈ కారు ధర దాదాపుగా రూ.1.93 కోట్లు. ఈ కారులో 6 సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. ఈ కారు 2,998 సీసీ ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. గరిష్టంగా గంటకు 281 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
సన్నీ టాప్ కార్ కలెక్షన్‌లో రెండో అతి ఖరీదైనా కారు కూడా ఇటలీ కంపెనీకి చెందిన మసేరాటికి చెందినదే. తన రెండో అత్యంత ఖరీదైనా కారు.. మసెరాటి ఘిబ్లీ. ఈ కారు ఖరీదు దాదాపుగా రూ.1.15 కోట్లు ఉంటుంది. ఈ కారు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.. 3,799 సీసీతో వస్తుంది.
సన్నీ కారు కలెక్షన్ చూస్తే ఆమె అన్ని కంపెనీలు, అన్ని మోడల్ కార్లను ఇష్టపడుతుందనే విషయం అర్థమవుతూ ఉంటుంది. సన్నీ కలెక్షన్‌లో ఆడీ ఏ6 కారుగా కూడా ఒకటి. దీని ధర రూ.72 లక్షలుగా ఉంది.
మసెరాటి, బీఎండబ్ల్యూ కంపెనీలకు చెందినవే కాకుండా. మెర్సిడీజ్ కారు కూడా ఒకటి సన్నీ కలెక్షన్‌లో ఉంది. అదే మెర్సిడీజ్ జీఎల్350డీ మోడల్ కారు. దీని ధర దాదాపుగా రూ.70 లక్షలుగా ఉంది.
సన్నీ కలెక్షన్‌లో ఆమె రేంజ్‌కు సంబంధించి అయితే కాస్త తక్కువ ధర కారనే చెప్పాలి. అదే మోరిస్ గరాజ్‌కు చెందిన గ్లోస్టర్ మోడల్ కారనమాట. దీని ధర రూ.32 లక్షలుగా ఉంది. ఇలా సన్నీ తన కార్ కలెక్షన్‌లో అన్ని రకాల మోడళ్లను మెయిటైన్ చేస్తోంది.