మెగా ఫ్యామిలీ సక్సెస్ ఫుల్ హీరో వరుణ్ తేజ్ తర్వాతి ప్రాజెక్టు ‘గని’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో.. అల్లు బాబీ, సిద్ధు ముద్ద కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దే కాల్ హిమ్ గని.. కనివిని ఎరుగని’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు తమన్. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం సమకూర్చారు.
ఈ సినిమాలో బాక్సర్‌గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ చాలానే కష్టపడ్డాడు అని అతని ఫిజిక్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి నటిస్తున్నాడు. వరుణ్ తేజ్‌కు బాక్సింగ్ ట్రైనింగ్ ఇచ్చే గురువుగా సునీల్ శెట్టి కనిపించనున్నాడు. ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.