గీతామాధురి.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిత్ర పరిశ్రమలో అనేక పాటలు పాడిన గీతామాధురి తన గాత్రంతో అందరి మెప్పును పొందింది. అనతి కాలంలో స్టార్ సింగర్ గా ఎదిగిన ఈ గాయని ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇక టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన నందును గీతా మాధురి ప్రేమ వివాహం చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడుపుతోంది. అయితే ఈ స్టార్ సింగర్ ఇప్పటికీ కూడా సినిమాల్లో స్పెషల్ సాంగ్ లు పాడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది.
ఇక విషయం ఏంటంటే? గత కొన్ని రోజుల నుంచి గీతా మాధురి పేరుతో, ఫోటోతో వాట్సాప్ లో కొందరు మెసెజ్ లు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారంటూ గీతా మాధురి తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అమెరికా నెంబర్ తో కొందరు ఆన్ లైన్ కేటుగాళ్లు తన పేరుతో పాటు ఫోటోను కూడా వాడుతూ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా సినీ పరిశ్రమలోని కొందరి హీరోయిన్ల ఫోన్ నెంబర్లు కూడా అడుగుతున్నారు.
ఇది కూడా చదవండి: Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ విడుదల!
దయచేసి ఇది గమనించండి. ఇలా ఎవరిని కూడా నా ఫోటోతో కానీ నా పేరుతో కానీ ఎవరి నెంబర్లు అడిగినా ఇవ్వకండి అంటూ గీతా మాధురి సూచించింది. ఇలాంటి ఆన్ లైన్ మోసాలకు గీతా మాధురినే కాకుండా ఎంతోమంది సినీ ప్రముఖులను ఫేక్ ఫోటోలతో మోసాలను పాల్పడిన సందర్భాలు కోకొల్లలనే చెప్పాలి. ఇదే విషయంపై గీతా మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గీతా మాధురి పేరుతో వాట్సాప్ చాటింగ్ చేస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.