జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలో బాగా క్లిక్ అయిన కమెడీయన్ గెటప్ శ్రీను. సినిమాల్లో చాలా అవకాశాలు పొంది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ చార్మీతో ఓ వీడియోలో సందడి చేశాడు. లైగర్ మూవీ షూట్ గ్యాప్ అంటూ పెట్టిన ఒక వీడియోలో గెటప్ శ్రీను కనిపించాడు. అంటే లైగర్ మూవీలో గెటప్ శ్రీనుకు పాత్ర ఉందని తెలుస్తోంది. చార్మీ కోసం గెటప్ శ్రీను స్పెషల్ రెసిపీ ఒకటి చేసి ఆమెను ఇంప్రెస్ చేశాడు. ఆ వీడియోలో గెటప్ శ్రీను చికెన్ రోస్ట్ రెసిపీని చేశాడు. చిన్న గ్యాప్‌లో ఎగ్జైట్‌మెంట్‌తో గెటప్ శ్రీను, చార్మీ రెండు స్టెప్పులు కూడా వేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మరోవైపు లైగర్ మూవీపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు పూరీ జగన్నాథ్. మైక్ టైసన్ కూడా సినిమాలో నటిస్తున్నాడు అని తెలియగానే అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.