‘జబర్దస్త్’ కామెడీ షోతో పేరు తెచ్చుకున్నవాళ్లు ఎక్కువే. ఈ జాబితాలో చాలామంది ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను లాంటి ఎవరికీ సాధ్యం కాని రేంజ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఓవైపు షోలు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. అయితే కొన్నిసార్లు స్కిట్ లో భాగంగా కావొచ్చు, సినిమాల పరంగా కావొచ్చు కొన్ని పనులు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అలా ఇప్పుడు గెటప్ శ్రీను సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. దానికి కారణం లిప్ కిస్.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పలు షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్స్, కమెడియన్స్ సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు పోషిస్తుంటారు. అలానే కొన్నిసార్లు లీడ్ రోల్స్ కూడా చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతమున్న యాంకర్స్ సుమ, ప్రదీప్, శ్రీముఖి, సుడిగాలి సుధీర్.. లీడ్ రోల్స్ లో నటించేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి గెటప్ శీను కూడా వచ్చేశాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాజు యాదవ్’ అనే మూవీ గతేడాది ప్రారంభమైంది. చాలా రోజులకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుంది.
ఇక రిలీజ్ కు సిద్ధమవుతున్న మూవీ టీమ్.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే సంక్రాంతి కానుకగా ‘రాజు యాదవ్’ టీజర్ ని రిలీజ్ చేసింది. ఇందులో గెటప్ శ్రీను, రాజు అనే బస్తీ కుర్రాడిలా కనిపించాడు. క్రికెట్ ఆడుతున్న టైంలో తన నోటికి బంతి తగలడం వల్లే నవ్వు ముఖం అలానే ఉండిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టీజర్ చివర్లో హీరోయిన్ అంకితతో గెటప్ శ్రీను లిప్ లాక్ సీన్ లోనూ యాక్ట్ చేశారు. ఇలా లీడ్ రోల్ చేస్తున్న ఫస్ట్ మూవీలోనే ముద్దు సన్నివేశంలో నటించి హాట్ టాపిక్ గా మారాడు. మరి ఈ సీన్ మీకెలా అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.