మెగా ఫ్యామిలీపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ హీట్ పెంచాయి. మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్, నాగబాబులను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఇక రోజా మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తూ.. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారు.. అందరికీ సాయం చేస్తారు. కానీ మెగా బ్రదర్స్ మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. దాంతో మెగా అభిమానులు.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ సిలెండర్లు, కోవిడ్ రిలీఫ్ ఫండ్, ఆర్టిస్ట్‌లకు సీసీసీ ద్వారా ఆర్ధిక సాయం ఇవన్నీ రోజాకి కనిపించడం లేదా.. అంటూ ఓ రేంజ్లో ఫైరవుతున్నారు.
దీనిపై ఇప్పటికే నాగబాబు.. ట్విట్టర్ వేదికగా రోజాకు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్.. గెటప్ శ్రీను సైతం రోజా వ్యాఖ్యలపై మండిపడ్డాడు. మంత్రి రోజా తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ.. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు గెటప్ శ్రీను. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. రోజా నోటి నుంచి ఇలాంటి పచ్చి అబద్దాలు వినాల్సి వస్తుందని.. అనుకోలేదు. దయచేసి ఆ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి అని కోరాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
‘‘చిరంజీవి గారి సేవా గుణం.. దాన గుణం.. తెరిచిన పుస్తకం.. ఆయన ఒక స్ఫూర్తి.. మరి మీకెందుకు కనపడలేదో ? రోజాగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి. మీ ఉనికి కోసం.. ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీమీదున్న గౌరవాన్ని కోల్పోకండి.. మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు.. దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి’’ ఇట్లు చిరంజీవి అభిమాని అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి.. రోజా వీడియో ఎంబెడ్ చేశాడు గెటప్ శ్రీను.
ఇక దీనికి చిరంజీవిని ట్యాగ్ చేస్తూ.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి హాస్పటల్, సీసీసీ.. వంటి హ్యాష్ ట్యాగ్‌లను జోడించాడు గెటప్ శ్రీను. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇక రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం సహజం. ఇక్కడ వైసీపీ ప్రత్యర్థి జనసేన.. కాబట్టి.. రాజకీయాల్లో భాగంగా.. రోజా.. పవన్‌ని విమర్శించినా అర్ధం ఉంది.. కానీ చిరంజీవి ఏం చేశారు.. ఆయన సేవా గుణం గురించి విమర్శించే అర్హత రోజాకి ఉందా.. అంటూ మెగా అభిమానులు మండి పడుతున్నారు. మరి మెగా ఫ్యామిలీపై రోజా వ్యాఖ్యలు సరైనవే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.