SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Garikipati Narasimha Rao Praises Ram Charan And Jr Ntr Performance In Rrr Naatu Naatu Song

NTR, రామ్ చరణ్‌పై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. కవలలు సైతం ఇలా చేయలేరంటూ!

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్‌ఆర్‌ఆర్‌, నాటు నాటు పాటపైనే చర్చ. మరో మూడు రోజుల్లో.. రిజల్ట్‌ రాబోతుంది. నాటు నాటు పాట ఆస్కార్‌ గెలుస్తుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ దేశ ప్రజలంతా ఆస్కార్‌ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వీరిలో గరికపాటి కూడా ఉన్నారు. ఆవివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Thu - 9 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
NTR, రామ్ చరణ్‌పై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. కవలలు సైతం ఇలా చేయలేరంటూ!

రాజమౌళి దర్శకత్వంలో.. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. మరో రెండు వారాలు గడిస్తే.. ఈ చిత్రం విడుదలయ్యి ఏడాది పూర్తవుతుంది. సినిమా విడుదలయ్యి సంవత్సరం కావొస్తున్న.. ఇప్పటికి ఆర్‌ఆర్‌ఆర్‌ హవా కొనసాగుతూనే ఉంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో అత్యధిక వసూళ్లు సాధించని చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేయడమే కాక.. మరి కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. ఆర్‌ఆర్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతీ విశ్వవ్యాప్తమైంది. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో.. జక్కన్న, జూనియర్‌, రామ్‌ చరణ్‌ పేర్లు విదేశాల్లో సైతం మారుమోగిపోతున్నాయి.

ఇక ఈనెల 13న 95వ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తెలుగు వారితో పాటు భారతీయులంతా.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇక ట్రిపుల్‌ ఆర్‌కు ఆస్కార్‌ రావాలని కోరుకుంటున్న వారిలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా ఉన్నారు. నాటు నాటు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పురణాలు, వేదాల్లోని అంశాలనే కాక.. సమాజంలో చోటు చేసుకుంటున్న సంఘటనల గురించి కూడా ఆయన తన ప్రవచనాల్లో ప్రస్తావిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తన ప్రవచనంలో భాగంగా గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ పాట గురించి ప్రస్తావించారు. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని అన్నారు. అంతేకాక ఆ పాటలో నటించిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లపై ఆయన చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరలవుతున్నాయి.

ram charan ntr

నాటు నాటు పాటలో జూనియర్‌, మెగా పవర్‌ స్టార్‌ ప్రదర్శన గురించి వివరిస్తూ.. ‘‘అచ్చ తెలుగులో రాసిన పాటకు ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటనతో పాటు, కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కారణంగా నేడు ఈ పాటకు ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. నాకు నిన్నటి వరకు ఆ పాట గురించి తెలీదు. అయితే ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చించుకుంటున్నారు. దాంతో నేను మా అబ్బాయి పిలిచి ఆ పాటేంటో పెట్టరా అని చెప్పి.. దాదాపు అరగంట పాటు అలానే కూర్చొని నాటు నాటు పాట విన్నాను. ఆ పాట ఎందుకంత స్థాయికి వెళ్లిందో తెలుసుకోవాలి కదా. పాట పూర్తిగా విన్న తర్వాత.. నాకు అనిపించింది ఒక్కటే. అచ్చ తెలుగు పాట.. ఎక్కడా ఒక్క ఇంగ్లిష్ మాట లేదు. ఇంత చక్కగా రాసిన చంద్రబోస్‌కి నమస్కారం. చాలా మంచి పాట రాశారు’’ అంటూ గరికపాటి ప్రశంసలు కురిపించారు.

ఇక నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ అవ్వడమే చాలా గొప్ప విషయమని.. ఆ భగవంతుడి దయవల్ల మార్చి 13వ తేదీన.. ఇక పురస్కారం కూడా వస్తే మనంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరన్నారు గరికపాటి. అంతేకాక ‘‘నాటు నాటు పాటకు ఆస్కార్‌ పురస్కారం రావాలని కాంక్షిద్దాం. సరస్వతీ దేవిని పూజిద్దాం. గుడికి వెళ్లే వారు నాటు నాటుకు ఆస్కార్‌ రావాలని దేవుడికి దండం పెట్టండి. ఆ పురస్కారం వస్తే మనమంతా గర్వంగా తిరుగుతాం’’ అని సూచించారు గరికపాటి.

ram charan ntr

అంతేకాక ‘నాటు నాటు’ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌పై కూడా గరికపాటి ప్రశంసలు కురిపించారు. వయసులో చిన్నవారైనా వాళ్లకు నమస్కారం అనడం విశేషం. ‘‘నాటు నాటు పాటలో ఆ ఇద్దరి నటుల నటన ఎలా ఉందంటే.. ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు, ఇద్దరూ అలా కూడబలుక్కుని నటన చేయడం ఏదైతే ఉందో కవలలై పుట్టినవారికి కూడా సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి అద్భున నటన ప్రదర్శించారంటే.. వాళ్లు నా కంటే చిన్నవాళ్లైనా సరే.. ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను’’ అంటూ గరికపాటి ఎంతో గొప్పగా ప్రశంసించారు.

‘‘నేను కాస్త కష్టపడితే ఈ పాట రాయగలనేమో కానీ.. వాళ్లలాగా నేను ఎగరలేను కదా అని అనిపించింది నాకు’’అంటూ తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు గరికపాటి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఎంతో గొప్ప మేధావి అయిన గరికపాటి నరసింహారావు.. వయసులో తనకంటే ఎంతో చిన్నవాళ్లైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు నమస్కారం చెప్పడంపై ఆయన అభిమానులు పొంగిపోతున్నారు. ఇదీ గరికపాటి సంస్కారం అంటూ ప్రశంసిస్తున్నారు. మరి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Garikapati Narasimha Rao
  • Jr ntr
  • Natu Natu song
  • RAM CHARAN
  • RRR movie
  • tollywood news
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam