సామాన్యంగా వ్యాపార రంగంతో పాటు సినిమా రంగంలో వారసులు రావడమనేది మాములే. తాజాగా కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో కిరీటి రెడ్డి కథనాయకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్ ఇలా వారి అదృష్టాలను పరీక్షించుకున్నారు.
దర్శకుడు రాధాకృష్ణ కన్నడలో ఇదివరకు ‘మాయాబజార్’ అనే మూవీ తెరకెక్కించాడు. అయితే.. సినిమా హీరో అయ్యేందుకు గాలి జనార్ధన్ తనయుడు కిరీటి.. యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇండస్ట్రీలో అందరు హీరోలు కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు వచ్చాక పాన్ ఇండియా మూవీ గురించి ఆలోచిస్తారు. కానీ కిరిటీ రెడ్డిని పాన్ ఇండియా మూవీతోనే పరిచయం చేయాలని అనుకుంటున్నారు ఈ మాజీ మంత్రి.ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా గురించి డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘నటుడు కావాలన్నది కిరీటి రెడ్డి డ్రీమ్. అందుకోసమే యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్ నేర్చుకున్నాడు. తెలుగులో లెజెండ్, యుద్ధంశరణం చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్నినిర్మించనున్నట్లు తెలుస్తుంది. కాగా కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నేతల వారసులు సినిమాల్లో సత్తా చాటుతున్నారు. మరి కిరిటీ అదృష్టం ఎలా ఉందో చూడాలని అంటున్నారు మేకర్స్.