సినీ పరిశ్రమలో భాజాలు, భజంత్రీలు మోగుతున్నాయి. ఒక్కొక్కరుగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు స్వస్థి పలుకుతున్నారు. ఇటీవల శర్వానంద్ ఒక ఇంటివాడు అయ్యాడు. రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. కెవ్వు కార్తీక్ కూడా ఇదే నెలలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
సినీ పరిశ్రమలో భాజాలు, భజంత్రీలు మోగుతున్నాయి. శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు స్వస్థి పలుకుతున్నారు. ఇటీవల శర్వానంద్ ఒక ఇంటివాడు అయ్యాడు. రక్షితా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశారు. అంతకంటే ముందు జబర్థస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత పెళ్లి పీటలు ఎక్కారు. అలాగే కెవ్వు కార్తీక్ కూడా ఇదే నెలలో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. మెగా ఫ్యామిలీ ఇంట నెలలోనే రెండు శుభవార్తలు వినిపించాయి. ఒకటి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరగ్గా.. రామ్ చరణ్- ఉపాసన జంటకు తొలి సంతానం కలిగింది. ఇప్పుడు మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది.
శాండల్‌వుడ్‌లోని జంట పక్షులు హర్షికా పూనంచ, భువన్ పొన్నన్నలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆగస్టు 24న వీరి పెళ్లి జరగనుంది. దీనికి సంబంధించిన వివాహ పత్రిక వెలుగులోకి వచ్చింది. వారి ఈ శుభలేఖను కొడవ అనే భాషలో ముద్రించారు. విరాజ్‌పేటలోని అమ్మట్టిలో వీరి వివాహం జరగనుంది. హర్షిక పూనంచ, భువన్ పొన్నన్న చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ గతంలో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఈ నటీనటులు స్పందించలేదు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన లగ్న పత్రిక బయటకు వచ్చేసరికి వీరి పెళ్లి విషయం అందరికీ తెలిసింది.
ఇద్దరూ కలిసి సామాజిక కార్యక్రమాలు కూడా చేశారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో చాలా మందికి సహాయం చేశారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొడవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీ రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొననున్నారు.2008లో హర్షికా పూనంచ సినిమా పరిశ్రమలో కొనసాగుతుంది. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కనిపించిన ఆమె.. తెలుగులో కూడా ఓ సినిమాలో తళుక్కున మెరిసింది. 2016లో వచ్చిన అప్పుడిలా.. ఇప్పుడిలా అనే సినిమాలో నటించింది. భోజ్ పురి, తమిళ్, కొంకణి, కొడవ భాషల్లో నటించి మెప్పించింది. భువన్ ఇప్పటి వరకు కన్నడ సినిమాల్లో కనిపించారు. ఒకే ఒక్క తమిళ్ మూవీలో నటించారు.