ప్రముఖ బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖరరెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక, ఈ సినిమా మంచి రివ్యూలు తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. చిన్న హీరో స్థాయిని మించి సుధీర్ కలెక్షన్లను రాబడుతున్నాడు. రెండో సినిమాతోనే భారీ రికార్డును నెలకొల్పాడు. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.24 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రెండు రోజుల్లోనే ‘జిన్నా’ సినిమా కలెక్షన్లను తుడిచిపెట్టేసింది. జిన్నా ప్రపంచ వ్యాప్తంగా 1.65 కోట్ల రూపాయల క్లోసింగ్ కలెక్షన్లను రాబట్టగా.. ఈ మార్కును సుధీర్ రెండు రోజుల్లోనే అందుకున్నాడు.
అంతేకాదు! ఐదు రోజుల కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌ను చేరుకున్నాడు. ఈ సినిమా ఐదు రోజుల్లో 5.60 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ 3 కోట్లను కూడా రాబట్టింది. గాలోడు షేర్ 3 కోట్ల రూపాయలుగా ఉంది. గాలోడు బ్రేక్ ఈవెన్ విలువ ‘‘జిన్నా’’ గ్రాస్ కంటే రెండు రెట్లు ఎక్కువ. గ్రాస్‌ను చూసుకుంటే ‘‘జిన్నా’’ కంటే ‘‘గాలోడు’’ నాలుగు రెట్లు ఎక్కువ రాబట్టాడు. మొదటి రోజు ఈ సినిమా ఆంధ్రాలో దాదాపు 47 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. నైజాంలో 36 లక్షల రూపాయలు.. సీడెడ్‌లో 18 లక్షల రూపాయలు వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 1.01 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1.05 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దీంతో మంచు విష్ణుపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. నెటిజన్లు ‘‘జిన్నా’’ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఓ చిన్న సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావటం చిన్న విషయం కాదు. సుధీర్‌కు ఉన్న మాస్ క్రేజ్ వల్ల ఇది సాధ్యం అయిందని అభిమానులు భావిస్తున్నారు. హీరోగా సుధీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సుధీర, రష్మీ కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనిపై గాలోడు చిత్ర దర్శకుడు రాజశేఖరరెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. సుధీర్‌తో తాను చేసిన రెండు సినిమా కథలను రష్మీకి చెప్పానని అన్నారు. డేట్స్ కారణంగా ఆమె సినిమా చేయలేకపోయారని చెప్పారు. సుధీర్, రష్మీ ఇద్దరితోనూ తాను సినిమా చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అతి త్వరలో కచ్చితంగా సినిమా చేస్తానన్నారు. ఇద్దరితో గజ్జల గుర్రం సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
#Gaalodu Collected MASSIVE 5.60 CR. + Gross WW in Just 5 Days 💥
BREAKEVEN Done ✅#SudigaliSudheer ~ @SudheerAnand
Marana MA’SS’ Rampage ⚡ 💥 🔥#MassiveBlockBusterGaalodu ❤️🔥 pic.twitter.com/FCvwGq5Nzh— Sudigali Sudheer Fans Club (@S_Sudheer_FC) November 23, 2022