ఫన్ బకెట్ భార్గవ్.. అతి చిన్న వయసులోనే సోషల్ మీడియాలో సెలబ్రెటీగా ఎదిగిన వ్యక్తి. కొని నెలల క్రితం వరకు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఇతని వీడియోలే వైరల్ అవుతూ వచ్చాయి. కానీ.., భార్గవ్ మైనర్ బాలికని లొంగతీసుకుని, ఆమెని గర్భవతిని చేసిన కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ కేసు కోర్ట్ లో ఉంది. ప్రస్తుతం బెయిల్ పై బయటకి వచ్చిన భార్గవ్.. ఇప్పుడిప్పుడే కెమెరాని ఫేస్ చేస్తున్నాడు. తన వర్క్స్ తో బిజీగా అవుతున్నాడు. అయితే.., భార్గవ్ పై పెట్టిన కేసు ఏమిటి? అందులో అతని తప్పు ఉందా? లేదా? అసలు ఆరోజు ఏమి జరిగింది? ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఫన్ బకెట్ భార్గవ్ సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భార్గవ్ ఎమోషనల్ అవుతూ మాట్లాడాడు.
” కావాలని నా మీద తప్పుడు కేసు పెట్టారు. నేను తప్పు చేశాను అని మీరు ఏదైతే విన్నారో, వింటున్నారో.. అది నిజం కాదు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. త్వరలోనే న్యాయస్థానం అన్నీ నిజాలను బయట పెడుతుందని భార్గవ్ చెప్పుకొచ్చాడు. ఇక జైలు జీవితం శాపంగా తోచిందని, ఆ సమయంలో చనిపోవాలని కూడా అనిపించిందని తెలియచేశాడు భార్గవ్. కాకుంటే.., తన తప్పు లేకపోవడం వల్ల, తన లాయర్ చాకచక్యం వల్ల తనకి రెండో నెలల్లోనే బెయిల్ వచ్చిందని తెలియచేశాడు.
ఇక జైలు జీవితం నుండి ఏమి నేర్చుకున్నావు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి భార్గవ్.. ఎవరిని అతిగా నమ్మకూడదని నేర్చుకున్నట్టు సమాధానం చెప్పాడు. తన జీవితంలో ఏడుపే ఎక్కువని, తాను సంతోషంగా ఉన్న సమయం తక్కువ అని, ఈ కష్టాన్ని కూడా దాటి బయటపడగలనన్న నమ్మకం తనకుందని భార్గవ్ చెప్పుకొచ్చాడు.
ఇక తనని ట్రోల్ చేసే వాళ్ళని మాత్రం పట్టించుకొనని చెప్పాడు భార్గవ్. నా ఫోన్స్, ల్యాప్ టాప్, కామెరా పోలీసులు వెనక్కి ఇచ్చారని, ఇకపై నా పని మీదే నా ద్రుష్టి ఉంటుందని భార్గవ్ ఇంటర్వూలో తెలియచేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., భార్గవ్ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.