ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చెన్నైలోని తన నివాసంలో 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే, వాణీ జయరామ్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చనిపోయే సమయానికి ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. అయితే, ఆ గాయాలు ఎలా అయ్యాయన్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే సమాచారం అందుకున్న ట్రిపుల్‌కేన్ పోలీసులు రంగంలోకి దిగారు. వాణీ జయరామ్ మరణంపై అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఓమేదురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫోరెన్సిక్ నిపుణులు వాణీ జయరామ్ ఇంట్లో ఆధారాల కోసం అన్వేషించారు. దాదాపు అరగంట పాటు ఇంట్లో సోదాలు చేశారు. సింగర్ ఫ్లాట్ ప్రస్తుతం పోలీసుల ఆధీనంలోనే ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక సమర్పించిన తర్వాత ఆమె భౌతిక దేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఆమెది హత్యా? లేక సహజ మరణమా? అన్నది తెలియాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చే రిపోర్టు ద్వారా ఓ క్లారిటీ వస్తుంది.
పాటల కోయిల వాణీ జయరామ్..
వాణీ జయరామ్ తమిళనాడు రాష్ట్రంలోని వేళ్లూర్ సిటీలో పుట్టారు. వాణీ జయరామ్ కుటుంబసభ్యులది సంగీతంపై మక్కువ కలిగిన కుటుంబం. దీంతో చిన్నతనంలోనే వాణీకి సంగీతం అబ్బింది. ఆమె 1971లో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె తన జీవిత కాలంలో మొత్తం 10 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంలో టాప్ సింగర్‌గా పేరు పొందారు. 1969లో జయరామ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తన పేరుతో భర్త పేరును కలుపుకుని వాణీ జయరామ్‌గా పేరుపొందారు. మరి, వాణీ జయరామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.