కరోనా కారణంగా థియేటర్ల నుండి పెద్ద సినిమాలు వాయిదా పడేసరికి చిన్న సినిమాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి. పెద్ద సినిమాలైతే థియేటర్లలో వారానికి ఒకటి లేదా రెండే వచ్చే అవకాశం ఉంది. కానీ చిన్న సినిమాలు కాబట్టి వారానికి నాలుగైదు వస్తుంటాయి. ఈ ఏడాది ప్రారంభం(జనవరి)లో ఎక్సపెక్ట్ చేసిన పెద్ద సినిమాలు వాయిదాపడి ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. అయితే.. చిన్న సినిమాలు, డబ్బింగ్(హాలీవుడ్, హిందీ) సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రం ప్రతివారం OTT వేదికగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఫిబ్రవరి మొదటి వారం వచ్చేసింది. ఈ వారం ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్న మూవీస్, వెబ్ సిరీస్ ల లిస్టు చూద్దాం!
ఫిబ్రవరి 2:
ద టిండర్ స్విండ్లర్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్
ఫిబ్రవరి 3:
ఫైండింగ్ ఓలా(వెబ్ సిరీస్), మర్దర్ విల్లే (వెబ్ సిరీస్) – నెట్ ఫ్లిక్స్
ఫిబ్రవరి 4:
ఒన్ కట్ టూ కట్ (కన్నడ), రీచర్ (హాలీవుడ్) – అమెజాన్ ప్రైమ్
లూప్ లపేట, ధ్రూ మై విండ్ (హాలీవుడ్) – నెట్ ఫ్లిక్స్
రాకెట్ బాయ్స్ (హిందీ సిరీస్) – సోనీ లివ్
100 (కన్నడ) – జీ5
ది గ్రేట్ ఇండియన్ మర్దర్ (హిందీ సిరీస్) – డిస్నీ ప్లస్ హాట్ స్టార్
థియేట్రికల్ రిలీజ్: ఫిబ్రవరి 4న సామాన్యుడు, కోతలరాయుడు, కే3, అతడు ఆమె ప్రియుడు, పటారుపాళెం ప్రేమకథ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ కొత్త సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.