తమ అభిమాన హీరోకి అవమానం జరిగిందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ తారక్ గురించి తక్కువ చేసి మాట్లాడాడంటూ ఒక ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తుంటే హీరోల మధ్య ఉండే దాని కంటే వారి ఫ్యాన్స్ మధ్య ఈగో అనేది అగ్గి రాజుకుంటుంది. ఎవరిది పై చేయి అనే పోలిక మొదలవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఇంకా ఈ పోలిక కొనసాగుతోంది. నిజానికి ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే పోలిక పెట్టే వీలు లేనంత గొప్పగా ఇద్దరూ రామ్, భీమ్ పాత్రల్లో అద్భుతంగా జీవించారు. అయినా కానీ చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరు గొప్ప అనే పోలిక పెట్టుకుంటూ ఇరువురి ఫ్యాన్స్ ఇంకా సోషల్ మీడియా వేదికగా గొడవ పెట్టుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో అవమానం జరిగిందని తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం యూఎస్ వెళ్లారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. అవార్డు వేడుక మార్చి 12న జరగనుండగా.. ఎన్టీఆర్, చరణ్ లు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రోగోసో పాడ్ కాస్ట్ షోలో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ పాడ్ కాస్ట్ లో రామ్ చరణ్ తన హాలీవుడ్ డెబ్యూ సహా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పాడ్ కాస్ట్ షో హోస్ట్ ఎన్టీఆర్ ని అవమానించే విధంగా మాట్లాడడం ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ ఇంటర్వ్యూలో సదరు హోస్ట్.. ఎన్టీఆర్ ను సైడ్ హీరో అంటూ సంబోధించాడు. సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్ అంటూ మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ ని సైడ్ యాక్టర్ అనడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొన్నా మధ్య కూడా హెచ్సీఏ స్పాట్ లైట్ అవార్డ్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ ని తక్కువ చేశారని మండిపడ్డారు. అయితే ఆ తర్వాత జ్యూరీ ఎన్టీఆర్ కార్యక్రమానికి రాలేకపోవడం వల్ల అవార్డు ఇవ్వలేదని, త్వరలో అవార్డు పంపిస్తామని క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదం ముగిసేలోపే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అంటూ సదరు హోస్ట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంపై తారక్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని కావాలని కట్ చేసి వైరల్ చేస్తున్నారని మండిపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Entha Maata anadu ra adu 😭 @tarak9999 pic.twitter.com/HxbioX5L2v
— ~RammY~ (@AlwaysRCever) March 8, 2023