యన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమాని మంచి స్పందన వస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు వస్తున్న ఈ షోలో హాట్ సీట్ పై కూర్చున్న వారిని యన్టీఆర్ తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడం.. అంతలోనే వారితో సంతోషంగా మాట్లాడటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లో సెలబ్రెటీల సందడి కూడా బాగానే ఉంది. ఈ షోలో మొదట హాట్ సీట్ పై కూర్చొన్నది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్టులుగా వచ్చారు.
తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమానికి అందాల నటి సమంత వస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను జెమినీ టీవీ విడుదల చేసింది. ఈ ప్రోగ్రాంకు “ఎవరు మీలో కోటీశ్వరులు నవరాత్రి స్పెషల్ విత్ సమంత” అని పేరుపెట్టింది. ఇక ప్రోమో విషయానికొస్తే… సీట్లో కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అంటే.. యన్టీఆర్ అవును ఉంటుంది.. ఎందుకంటే ఇది హూస్ట్ సీట్.. అది హాట్ సీట్ అంటూ ఛలోక్తి విసిరాడు. మామూలుగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళ్తారు.. కానీ నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తావ్.. ఎంత బాగుంటుందో కదా.. ఆట అంటూ తనదైన స్టైల్లో కామెడీ పండించారు యన్టీఆర్.
ఇక సమంత విషయానికి వస్తే.. నాకు డబ్బు వద్దులే అనడం, ఆ తర్వాత … కావాలి కావాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించడం, క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా… మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ సమంత చిరుకోపం ప్రదర్శించడం చూస్తుంటే ఈ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. ఈ నెల 14న జెమినీ టీవీలో సమంత స్పెషల్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుందని తాజా సమాచారం. తాజాగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.