సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. సుమన్ టీవీకి ఎస్తేర్ ఎక్స్ క్లూసివ్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. అందులో భాగంగా.. మీ ఇంటర్వ్యూలు చూసి నోయల్ మీకు కాల్ చేశాడా? అనే ప్రశ్నపై కూడా ఆమె స్పందించింది.
ఇదీ చదవండి: గాయత్రి చేసిన డాన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన సురేఖ!
‘తన ఇంటర్వ్యూలు చూసి నోయల్ నాకు ఫోన్ చేసే అంత లేదు. నేను ఏమీ అతని క్యారెక్టర్ తక్కువ చేసేలా మాట్లాడలేదు. ఏం జరిగిందో అదే చెప్పాను. మా సర్కిల్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు కాబట్టి నన్ను ఎవరూ తప్పుబట్టలేదు’ అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది. ఎస్తేర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.