సినిమా ప్రపంచంలో ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు సంబంధించి పెద్దగా దాపరికాలు ఏమీ ఉండవు. అదే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. వారి పెళ్లి, విడాకులు వంటి విషయాలు రెట్టించిన వేగంగా పాకుతాయి. అలాగే ఎస్తేర్, నోయల్ విడాకుల అంశం ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. వారు విడిపోయినప్పటి పరిస్థితులు, ఆమె ఎదుర్కొన్న సంఘటనల గురించి సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
‘నాకు పెళ్లికి ముందు నుంచే తెలుగు అభిమానులతో సత్సంబంధాలు ఉన్నాయి. తెలుగు ప్రాంతానికి కోడలిగా వెళ్తున్నానని చాలా సంబంరపడి పోయాను. పెళ్లి తర్వాత నేను చూసిన వ్యక్తి వేరు. అప్పటి వరకు బయటకు కనిపించిన వ్యక్తి వేరు. నేను ఎవరినీ బ్యాడ్ చేయాలి అనుకోవడం లేదు. పెళ్లి అంటే రెండు కుటుంబాలకు సంబందించిన అంశం. నేను ఏం మాట్లాడినా అది అతని కుటుంబాన్ని, సన్నిహుతలను ఇబ్బంది పెట్టవచ్చు. మొదట్లో నన్ను తిట్టుకున్న వాళ్లే తర్వాత విషయం తెలుసుకుని నాకు మెసేజ్ చేశారు’ అంటూ ఎస్తేర్ చెప్పుకొచ్చింది. ఎస్తేర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.