సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య క్షీణంచటంతో గురువారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల ముందే ఆనారోగ్యం చెంది రజినీ ఆస్పత్రిలో చేరారు. దీంతో మరోసారి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లటంతో రజినీ అభిమానులు కాస్త ఖంగారు చెందుతున్నారు. దీంతో ఆయన హెల్త్ రిపోర్ట్ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ కోరారు.
అయితే తాజాగా చెన్నైలో రజినీ కాంత్ చేరిన ఆస్పత్రి వైద్యులు హెల్త్ రిపోర్డ్ ను విడుదల చేశారు. రజీని కాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఈ రోజు కరోటిడ్ ఆర్టిడ్ రివాస్కులరైజేషన్ ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు. ఇక మరి కొన్ని రోజుల్లో రజినీ కాంత్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.