మోడ్రల్ లుక్ లో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా? సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించి తనకుంటూ ఓ గుర్తింపును సంపాదించింది. తెలుగులో వచ్చిన ఆ చిత్రంతో ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకుంది. ఇంతకి ఈ హీరోయిన్ ఎవరనేదే కదా మీ ప్రశ్న..
పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరని తెగ ఆలోచిస్తున్నారా? ఈ అమ్మడు 2012లోనే ఓ తమిళ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి చిన్న తనంలోనే ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే, ఈ హీరోయిన్ మలయాళం, తమిళ భాషల్లోనే కాకుండా తెలుగులోనూ నటించి తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ఇక తెలుగులో నటించిన ఆ సినిమాతో సింగిల్ నైట్ లోనే పాపులారిటీని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరో కాదు.. ఇవానా.
తెలుగులో వచ్చిన లవ్ టుడే సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిందనే చెప్పాలి. ఈ మద్దుగుమ్మ నటనతోనే అందంతో కూడా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకునేలా చేసింది. ఇకపోతే, 2012లో మాస్టర్స్ సినిమాతో బాల నటిగా పరిచయం అయిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత రాణి పద్మిని, అనురాగ కరికిన్ వెల్లం, నాచియార్, హీరో, లవ్ టుడే వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే, ఈ హీరోయిన్ సోషల్ మీడియలో సైత తెగ యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు అందమైన ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది.