వెండితెరపై కొంతకాలంగా కొత్త సోయగాలు వెల్లివిరుస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సూపర్ హిట్స్ కొడుతూనే.. మరోవైపు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు కొత్త బ్యూటీలు. అటు నటన పరంగా, ఇటు గ్లామర్ పరంగా స్క్రీన్ పై అగ్గి రాజేస్తున్నారు. పరభాష నుండి వచ్చి.. ఇక్కడ తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్డమ్ ని అందుకుంటున్న బ్యూటీలను ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం.
తెలుగు వెండితెరపై కొంతకాలంగా కొత్త సోయగాలు వెల్లివిరుస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు సూపర్ హిట్స్ కొడుతూనే.. మరోవైపు వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు కొత్త బ్యూటీలు. అంతేగాక.. అటు నటన పరంగా, ఇటు గ్లామర్ పరంగా స్క్రీన్ పై అగ్గి రాజేస్తున్నారు. పరభాష నుండి వచ్చి.. ఇక్కడ తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంటూ స్టార్డమ్ ని అందుకుంటున్న బ్యూటీలను ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. చూడగానే ఆకట్టుకునే అందాలతో.. అందమైన హావభావాలతో.. అంతకుమించి సోషల్ మీడియాలో ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు.
ఈ మధ్య డబ్బింగ్ సినిమాలతో వచ్చి.. సక్సెస్ అవుతున్న హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. అయితే.. తమిళ, కన్నడ, మలయాళం భాషలలో హిట్స్ కొట్టి.. టాలీవుడ్ లో డెబ్యూ చేసిన హీరోయిన్స్ లో ఇప్పుడు మనం చూస్తున్న చిన్నారి కూడా ఉంది. ముందుగా డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారిని పలకరించినప్పటికీ.. రీసెంట్ గా ట్రెండింగ్ హీరో సరసన టాలీవుడ్ డెబ్యూ చేసింది. పైన ఫోటోలో కనిపిస్తున్న పాపాయి ఎవరో గుర్తు పట్టారా? మంచి నటనతో పాటు తన గ్లామర్ తో సినీ ప్రియుల గుండెలలో సెగలు రేపుతోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటిటి సినిమాలు, సిరీస్ లలో కూడా సత్తా చాటుతోంది.
ఆ పాప ఎవరో కాదు.. కేరళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. మలయాళ, తమిళ సినిమాలు చాలా చేసి.. గతేడాది సత్యదేవ్ సరసన ‘గాడ్ సే’ మూవీతో తెలుగు డెబ్యూ చేసింది. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన పాన్ ఇండియా మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో మెరిసింది. అలా మట్టికుస్తీ, అమ్ము వెబ్ సిరీస్ లతో మంచి ప్రశంసలు దక్కించుకుంది. మొదటగా డాక్టర్ అవ్వాలని ఎంబీబీఎస్ పూర్తిచేసిన ఐశ్వర్య.. ఓ ఫోన్ కాల్ ద్వారా సినిమా రంగంవైపు అడుగులు వేసినట్లు గతంలో తెలిపింది. మరి ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి చైల్డ్ హుడ్ ఇమేజ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఐశ్వర్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.