పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడిని చూశారా..? చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉన్నాడు కదూ.. ఎవరో గల్లీల్లో తిరిగే బాలుడు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు అనుకునే విధంగా ఇతడు మాములోడు కాదు.. ఇప్పుడో స్టార్ హీరో. అవును మీరు విన్నది నిజమే. భారీ పర్సనాలిటీతో అటు హీరోగా, ఇటు విలన్ గా రాణిస్తూ.. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అంతలా పొగుడుతున్న ఆ హీరో ఎవరనే కదా మీ ప్రశ్న. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ఒక్కొక్కట్టిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికి చాలా మంది హీరో, హీరోయిన్ల ఫోటోలు బయటకు వచ్చి కాస్త వైరల్ గా కూడా మారాయి. ఇక విషయానికొస్తే.. పైన ఫొటోలో ఉన్నది ఎవరో కాదండోయ్.. మన దగ్గుబాటి రానా. బాహుబలి సినిమాతో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుని అందరి మన్ననలు పొందాడు. ఇక ఈ సినిమాతో రానా రేంజ్ ఇంకాస్త పెరిగింది. అయితే ఈ రోజు రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన సతిమణి మిహిక ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
మిహిక ఆ ఫోటోను పోస్టూ చేస్తూ.. చాలా అందంగా ఉన్న ఈ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. చూడండి.. ఎంతో ముద్దుగా ఉన్నాడో. మీరు నా లైఫ్ లోకి తీసుకువచ్చిన సంతోషానికి ధన్యవాదాలు. నాకు భర్తతో పాటు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. నేను నిన్ను లవ్ చేస్తున్నా బేబీ.. నీ పట్ల నీ ప్రేమకు హద్దులు లేవు. రాబోయో రోజుల్లో మీ కలల నిజమవ్వాలని కోరుకుంటున్నా.. అంటూ ఆయన భార్య మిహికా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చదివిన అభిమానులు, సినీ ప్రముఖులు రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఆగస్టు 8, 2020లో రానా, మిహిక పెళ్లితో ఒక్కటయ్యారు.