అందరిలానే ఈ బాబుది చదువు పూర్తయ్యింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తర్వాత సినిమాల మీద పేషన్ ప్రో తో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నితిన్ నటించిన సంబరం అనే సినిమాలో డ్రైవర్ పాత్రలో చేయడం జరిగింది. ఆ సినిమాకి క్రెడిట్స్ కూడా వేయలేదు. అంత చిన్న పాత్ర చేసిన ఈ బాబు.. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయడం జరిగింది. అందులో కాలేజ్ కుర్రాడి పాత్రలో కనిపించడం జరిగింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నలుగురు హీరోల్లో ఒక హీరోగా చేయడం జరిగింది. ఈ సినిమాకు ఇతను తీసుకున్న రెమ్యునరేషన్ 25 వేలు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కానీ మొదటి సినిమా స్థాయి హిట్ అయితే రాలేదు. దీంతో ఫ్లాప్ హీరోగా ముద్ర పడిపోయింది.
వరుసగా సినిమాలు చేస్తున్నా గానీ అన్నీ డిజాస్టర్లే. ఒక్కటీ సరైన సినిమా చేయడం లేదు. దీంతో ఇక ఈ హీరో పని అయిపోయిందనుకున్నారు. అప్పుడొచ్చాడండి.. కుర్రాడు.. అంతే వరుస పెట్టి హిట్లు ఇస్తూనే ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళు వరుస ఫ్లాప్ లతో సతమతమైన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అతను మరెవరో కాదు.. నిఖిల్ సిద్దార్థ్. హ్యాపీ డేస్ సినిమాలో రాజేష్ పాత్రతో కాలేజ్ కుర్రాళ్లందరికీ దగ్గరైన నిఖిల్.. ఆ తర్వాత అంకిత్ పల్లవి & ఫ్రెండ్స్, యువత, కళవర్ కింగ్, ఓం శాంతి, వీడు తేడా, డిస్కో రాజా వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ హీరో పని అయిపోయింది, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనే స్థాయికి వచ్చేసాడు.
కట్ చేస్తే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2013లో స్వామిరారా సినిమాతో సాలిడ్ కమ్ బ్యాక్ తో వచ్చాడు. ఈ సినిమా నిఖిల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన కార్తికేయ సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 సినిమాతో టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా జండా పాతేశాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది.
దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం నిఖిల్ నటించిన స్పై సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ కి సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో నిఖిల్ తో ఉన్నది మరెవరో కాదు, నిఖిల్ తల్లి. తల్లి ఒడిలో కూర్చుని.. ముందు ఒక కోతి బొమ్మ పెట్టుకుని అప్పట్లో దిగిన ఫోటో ఇది. సెలబ్రిటీలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలోనే నిఖిల్ కి సంబంధించిన చిన్న నాటి ఫోటో కూడా నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. మరి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న స్టేజ్ నుంచి వరుస హిట్స్ తో దూసుకుపోయే స్టేజ్ కి.. ఒక యావరేజ్ హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నిఖిల్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.