సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యం కాదు.. ఎలాంటి సినిమాలు చేశాం.. ఎంతకాలం ప్రేక్షకులకు గుర్తున్నాము అనేది ముఖ్యమని కొంతమంది హీరోయిన్స్ ని చూసినప్పుడు అనిపిస్తుంది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. మొదటి సినిమాతోనే జనాలకు బాగా నచ్చేస్తారు.. కానీ, ఎందుకో ఎక్కువకాలం ఇండస్ట్రీలో కంటిన్యూ కాలేరు. అయితే.. అలాంటి అరుదైన హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నా.. లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో గుర్తు చేస్తూనే ఉంటారు. గ్లామర్ పరంగా కాదు.. వారు చేసిన క్యారెక్టర్స్, పలికించిన హావభావాలు జనాల్ని అట్రాక్ట్ చేస్తాయి.
ఆ విధంగా ఇటు దక్షిణాదిని.. అటు బాలీవుడ్ ని ఊపేసిన మలయాళీ కుట్టి ఆసిన్. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. హీరోయిన్ గా తెలుగు సినిమాలతోనే కెరీర్ ఆరంభించింది. 1985లో కొచ్చిలో పుట్టి పెరిగిన ఆసిన్.. 15 ఏళ్ళ వయసులో మోడలింగ్ లో అడుగుపెట్టింది. చదువు పరంగా డాక్టర్ అవ్వాలనుకున్న ఆసిన్.. మోడలింగ్ లోకి వచ్చాక యాక్టర్ గా టర్న్ అయ్యింది. అలా హీరోయిన్ గా ఆసిన్ చేసిన మొదటి సినిమా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. పూరి డైరెక్షన్ లో చేసిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలుసు. ఆ వెంటనే మళ్లీ పూరితో శివమణి సినిమా చేసి హిట్ అందుకుంది.
ఇక హీరోయిన్ గా హిట్స్ పడేసరికి తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేసింది. ఇక తెలుగులో వెంకటేష్ తో ఘర్షణ, బాలకృష్ణతో లక్ష్మి నరసింహ, ప్రభాస్ తో చక్రం, పవన్ కళ్యాణ్ తో అన్నవరం సినిమాలు చేసింది. తమిళంలో సూర్యతో గజినీ చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిన ఆసిన్.. బాలీవుడ్ లక్ష్యంగా అటువైపు అడుగులేసింది. అలా హిందీలో అమీర్ ఖాన్ తో ‘గజినీ’ చేసి సూపర్ హిట్ డెబ్యూ అందుకుంది. 2015లో చివరిగా ‘ఆల్ ఈజ్ వెల్’ అనే మూవీ చేసి.. 2016లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన ఆసిన్ కి.. అరిన్ ర్యాన్ అనే కూతురు ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆసిన్ కి సంబంధించి చిన్నప్పటి పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆసిన్ చిన్నప్పటి పిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.