చిత్రపరిశ్రమలో క్లాసికల్ డాన్స్ తో మెప్పించిన హీరోయిన్లను చాలా తక్కువమందిని చూశాం. 1980-90ల కాలంలోనే ఎన్నో క్లాసిక్ సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ సినిమాలలో హీరోయిన్ల పాత్రలు, నడవడిక అన్నీకూడా ప్రేక్షకులను, ముఖ్యంగా యూత్ ని ఎంతో చక్కగా ఆకట్టుకునేవి. అలాంటి క్లాసికల్ పాత్రలలో నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. అవును.. నటిగా ఎంత గొప్ప పేరుందో.. క్లాసికల్ డాన్స్(శాస్త్రీయ నృత్యం)లో కూడా అంతకుమించి అనుభవం, సక్సెస్ ఉన్నాయి. తెలుగుతో పాటు సౌత్ ఇండియా మొత్తం స్టార్ హీరోలందరితో సరసన బిగ్ హిట్స్ అందుకుంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తొచ్చిందా? నటి శోభన. అవును.. తెలుగులో అభినందన, రుద్రవీణ, దళపతి, త్రిమూర్తులు, నారి నారి నడుమ మురారి, అల్లుడుగారు, రౌడీ గారి పెళ్ళాం, రౌడీ అల్లుడు, ఏప్రిల్ 1 విడుదల, కన్నయ్య కిట్టయ్య, అప్పుల అప్పారావు లాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. చక్కని ఆహార్యం, నాట్యం, అన్నింటికి మించి అందంతో శోభన అలా తెలుగు ప్రేక్షకుల కళ్ళముందు నిలిచిపోయింది. ఇప్పటికి శోభన పేరు వినిపించినా, ఆమె ఫోటో కనిపించినా.. 90ల ఆడియెన్స్ అందరికీ ఒక్కసారిగా ఈ సూపర్ హిట్ సినిమాలన్నీ గుర్తొస్తుంటాయి. అయితే.. తెలుగుతో పాటు మలయాళం, తమిళ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషలలో కూడా శోభన సినిమాలు చేసింది.
ఇక చాలా ఏళ్ళ క్రితమే సినిమాలు తగ్గించేసి.. అడపాదడపా స్క్రీన్ పై కనిపిస్తోంది. అదీగాక 52 ఏళ్ళ వయసు పైబడినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. పర్సనల్ లైఫ్ పరంగా శోభన లైఫ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో తెలియదు. కానీ.. సింగిల్ గా ఉంటూ.. కొన్నాళ్లుగా తనకు బాగా ఇష్టమైన క్లాసికల్ డాన్స్ లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ శోభనని తెరపై చూడాలని భావిస్తున్న ఫ్యాన్స్ ఎంతోమంది ఉండటం విశేషం. ఇదిలా ఉండగా.. శోభనకు సంబంధించి చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఎంతో చక్కగా రెండు జడలు వేసుకొని.. నవ్వుతూ ఫోజిచ్చింది. మరి శోభన గురించి, శోభన చిన్ననాటి పిక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.