సాధారణంగా హీరోయిన్స్ విషయంలో పాతనీరు పోయి కొత్తనీరు రావడం రెగ్యులర్ గా చూస్తుంటాం. కొంతమంది డైరెక్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. పెరిగి పెద్దయ్యాక హీరోయిన్స్ గా రాణిస్తుంటారు. అలా తెలుగులో ఇప్పుడున్న చాలామంది సీనియర్ నటీమణులలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా పెద్దయ్యాక పదిహేనేళ్లకే హీరోయిన్ గా మారి దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు కవర్ చేసినవారు కూడా ఉన్నారు. అలాంటివారిలో సీనియర్ హీరోయిన్ రాశి ఒకరు. రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
తెలుగులో బాలనటిగా పలు సినిమాలు చేసిన రాశి.. టీనేజ్ లోనే హీరోయిన్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన రాశి అసలు పేరు విజయ. సినిమాల్లోకి వచ్చాక తెలుగులో రాశి అని, తమిళ – మలయాళం సినిమాలలో మంత్ర అని పేరు మార్చారు. అలాగే హిందీలో కూడా రాశి పేరు విజయగానే కంటిన్యూ అయ్యింది. బాలనటిగా మమతల కోవెల, రావు గారి ఇల్లు, పల్నాటి పౌరుషం, బాలగోపాలుడు, ఆదిత్య 369 లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది రాశి. ఆ తర్వాత టీనేజ్ లోనే తమిళ, హిందీ సినిమాలలో హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఇక 1997లో పెళ్లి పందిరి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా సినిమాలు మొదలుపెట్టింది.
ఇక తెలుగులో గోకులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, సముద్రం, కృష్ణబాబు, మూడు ముక్కలాట, ఆమ్మో ఒకటో తారీఖు, సందడే సందడి లాంటి సూపర్ హిట్స్ చేసింది. దాదాపు తెలుగులో ఆ టైంలో స్టార్స్ గా ఉన్న అందరు హీరోల సరసన రాశి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో దేవత పాత్రలలో కనిపించి.. వెంకీ, సముద్రం, నిజం లాంటి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. 2005లో డైరెక్టర్ శ్రీమునిని పెళ్లాడిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం గిరిజ కళ్యాణం, జానకి కలగనలేదు సీరియల్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాశి చైల్డ్ హుడ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.